• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లష్కర్‌ లిస్ట్‌లో సచిన్‌, సౌరవ్‌

By Staff
|

Tejdeepహైదరాబాద్‌:అవినీతి సర్వాంతర్యామి అని దానికి బహురూపాలు ఉంటాయని,దానికి ఆడా మగాతేడా ఉండదని తాజాగా హెల్మెట్లసంఘటన నిరూపించింది. టూవీలర్స్‌ నడిపేవారంతా హెల్మెట్‌ ధరించడంతప్పని సరి అని ఇటీవల హైదరాబాద్‌ నగపోలీసులు ఉత్తర్వులు జారీచేశారు.హెల్మెట్‌ లేని వారికి జరిమానావిధించకపోయినా వారి ఆర్సీ బుక్స్‌ స్వాధీనం చేసుకునికౌన్సిలింగ్‌ పేరిట గంటల తరబడి వేధిస్తున్నారు.

నగర జీవనసమరంలో ప్రతి నిముషం ఎంతో విలువైనది కావడంతోపోలీసుల కౌన్సిలింగ్‌అంటే భయపడిపోతున్న సామాన్యులుహెల్మెట్‌ దుకాణాల మీద పడ్డారు.అవసరమైనన్ని హెల్మెట్లులేకపోవడంతో దుకాణదారులుహెల్మెట్లను అధిక ధరలకు బ్లాకులోఅమ్ముతున్నారు. దీనితో గంద్రగోళపరిస్ధితులు నెలకొన్నాయి. పాతికేళ్ళ క్రితం అప్పటిముఖ్యమంత్రి డాక్టర్‌మర్రి చెన్నారెడ్డి రాష్ట్రంలోని లారీలన్నీపసుపు రంగులో ఉండాలని ఒక ఆర్డర్‌ జారీ చేశారు.

పెయింట్స్‌ తయారీకంపెనీలనుండి ఆయన కోట్లాది రూపాయలలంచం పుచ్చుకుని ఈ పిచ్చి ఆర్డర్‌ జారీ చేశారని అప్పట్లోవిమర్శలు వచ్చాయి.ఇప్పుడు హెల్మెట్ల ఉత్తర్వు వెనుక కూడాఅటువంటి లాలూచీ జరిగిందని, ఈ సారి ముడుపులుపుచ్చుకున్నది నాయకులు కాదని, పోలీసుఉన్నతాధికారులని లోకం కోడై కూస్తున్నది.

హెల్మెట్‌నిబంధన పూర్వాపరాలు ఇవి. హెల్మెట్‌లులేకపోవడం వల్ల నగరంలో ఏటావందలాది ద్విచక్ర చోదకులు రోడ్డుప్రమాదంలో మరణిస్తున్నారు.రక్షణకు సంబంధించినది కాబట్టిహెల్మెట్‌ ధరించాలనడాన్ని ఎవరూవ్యతిరేకించడం లేదు. కానీఆగమేఘాల మీద అధికారులు ఉత్తర్వు జారీ చేసి ప్రజలనువేధించడమేఅభ్యంతరకరంగా ఉంది.

హెల్మెట్‌ధారణను తప్పనిసరి చేస్తూ చంద్రబాబునాయుడు హయాంలోనేఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పటి నగర ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ డిటినాయక్‌ హడావుడిగా ఆ ఉత్తర్వు వచ్చేలాచేశారు. హెల్మెట్‌ కంపెనీల నుంచి లంచాలుపుచ్చుకుని ఆయన హెల్మెట్‌ఉత్తర్వు తీసుకొచ్చారన్న విమర్శలమధ్య హెల్మెట్‌ ఉఅత్తర్వును వాయిదావేశారు. ఇంతలో ఎన్నికలు వచ్చాయి.కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చింది. నగర ట్రాఫిక్‌పోలీసు ఇంచార్జిగా డిటి నాయక్‌స్ధానంలో తేజ్‌దీప్‌ మీనన్‌ వచ్చారు.

సహజంగాకాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉండేవీక్‌లింక్స్‌ను ఆసరాగా చేసుకుని పోలీసుఉన్నతాధికారులు ఢిల్లీకి చెందిన ఒకహెల్మెట్‌ కంపెనీతో, దాని హైదరాబాద్‌డీలర్‌తో కుమ్మక్కై ఆగమేఘాల మీదఉత్తర్వు జారీ చేశారు. ఇప్పటికే లక్షలాదిరూపాయలు చేతులు మారాయని ముఖ్యమంత్రికి ఇంటిలిజెన్స్‌ రిపోర్టురావడంతో ప్రభుత్వం మేల్కొంది.రవాణా శాఖ మంత్రి సంతోష్‌రెడ్డి నిన్నస్వయంగా టూవీలర్‌ మీద ప్రయాణించిహెల్మెట్‌నిబంధన వల్ల నానా యాతనలుపడుతున్న సామాన్యులను స్వయంగా చూశారు.

ఐదారు వందలరూపాయల హెల్మెట్‌లను బ్లాక్‌లో పద్నాలువందల వరకు అమ్మడాన్ని ఆయనస్వయంగా చూశారు. అధికారులుతనను మోసం చేశారని ఆయనబాధపడ్డారు. నగరంలో తొమ్మిది లక్షల హెల్మెట్లుఉన్నాయని ట్రాఫిక్‌ పోలీసు ఉన్నతాధికారితనను, రవాణా శాఖ అధికారులనుతప్పుదోవ పట్టించారని రవాణా మంత్రిబహిరంగ వ్యాఖ్య చేశారు. హెల్మెట్‌ఉత్తర్వును పది రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.ఇంత గ ందరగోళానికి కారణమైన ఆ ట్రాఫిక్‌పోలీసు ఉన్నతాధికారిని బదిలీ చేస్తారో,కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇవన్నీ మామూలేనని జనం అనుకునేలాచేస్తారో చూడాలి.

ఈ పేజీని మీమిత్రులకు పంపండి

మన్మోహన్‌హంగ్‌!

రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు

షిండే సక్సెస్‌ స్టోరీ

ఆదిమానవుడికీ హనుమంతుడికీ లింకు!

ఉదయభాను విషాదగాధ

ఉత్తమ కంపెనీల్లో సత్యం

హిందీలోవీరప్పన్‌ సినిమా

అడవులవిస్తరణలో రాష్ట్రం టాప్‌

దసరామూవీస్‌

రెండోరౌండు సాధ్యమే!

కెసిఆర్‌మీమాంస

లంచగొండితనంసమస్య కాదా?

నానితో ఎన్టీఆర్‌కటీఫ్‌

ఇకనైనా నిదానం నాగేందర్‌

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more