వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మణికుమారికిసవతి పోరు!

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Saturday, July 17 2004

విశాఖపట్నం:మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీనాయకురాలు మణికుమారికి సవతిపోరు మొదలైంది. ఆమె భర్తవెంకట్రాజు వారసత్వ హక్కులనుడిమాండ్‌ చేస్తూ సింహాచలం అనేమహిళ రంగంలోకి దిగడంతో మణికుమారిన్యాయపోరాటానికి సిద్ధం కావాల్సివచ్చింది. శనివారం నాడుమణికుమారితో పాటు సింహాచలం అనేమహిళ లోక్‌ అదాలత్‌ ముందుహాజరయ్యారు.

మణికుమారితెలుగుదేశం ప్రభుత్వంలో గిరిజనసంక్షేమ మంత్రిగా పని చేశారు.ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఆమెపాడేరు నియోజకవర్గం నుంచితెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. మణికుమారిభర్త వెంకట్రాజును పీపుల్స్‌వార్‌నక్సలైట్లు ఈ ఏడాది మార్చి పద్దెనిమిదవతేదీన హత్య చేశారు. నక్సలైట్లహత్యకు గురైన వెంకట్రాజుకుటుంబానికి ప్రభుత్వం మూడు లక్షలరూపాయల నష్టపరిహారం మంజూరుచేసింది.

నష్టపరిహారంలోతనకు వాటా రావాల్సిందేననిఎ.యన్‌.యం. గా పని చేస్తున్నసింహాచలం అనే మహిళ కోర్టుకెక్కింది.వెంకట్రాజు తనను పందొమ్మిది వందలతొంబై రెండులో వివాహంచేసుకున్నాడని సింహాచలం అంటోంది. తనపిల్లలకు న్యాయం జరగాలనే తాను ఈపోరాటానికి దిగినట్లు ఆమె చెబుతోంది.తనను వెంకట్రాజు వివాహంచేసుకున్న విషయం పాడేరునియోజకవర్గంలో బహిరంగరహస్యమేనని ఆమె చెబుతోంది.అయితే ఈ విషయాన్ని చెప్పవద్దనిమణికుమారి వర్గంవారు అందరినీభయపెడుతున్నారని ఆమోఆరోపిస్తోంది.

సింహాచలంనుభయపెడుతున్నారనే ఆరోపణనుమణికుమారి ఖండిస్తున్నారు.వెంకట్రాజుతో సింహాచలంకు సంబంధంఉందో లేదో తెలియదని, ఇన్నాళ్లు చాటుగాఉండి ఇప్పుడెందుకు ముందుకువస్తోందని మణికుమారి అంటున్నారు.తనకు, వెంకట్రాజుకు పందొమ్మిదివందల ఎనబై ఎనిమిది జులై ఎనిమిదవతేదీన పెళ్లయిందని అంటూ అలాచూసుకున్న తన వివాహమే ముందుజరిగిందని, గిరిజనులకు కూడా హిందూ వివాహచట్టమే వర్తిస్తుందని, ఈ రకంగాచూసుకున్నా సింహాచలం వాదనచెల్లదని మణికుమారివాదిస్తున్నారు.

మొత్తంమీద మణికుమారి వ్యవహారంవిశాఖపట్నంలో ఆసక్తికరంగా మారింది.లోక్‌ అదాలత్‌ ముందు హాజరు కావడానికివిశాఖపట్నం కోర్టుకు వచ్చిన ఈ ఇద్దరుస్త్రీలను చూడడానికి ప్రజలు పెద్దయెత్తున గుమికూడారు.న్యాయవాదులు కూడా వారిని చూడడానికిఆసక్తి కనబరిచారు.

Recent Stories
కొడుకు రాజకీయంపై వైయస్‌
సైకిల్‌దిగిన బాబూఖాన్‌
సమైక్యనినాదం ఊపు
తిరగబడినరాత
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్‌టెండూల్కర్‌ - ఇంటర్వ్యూ హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X