వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్‌కు ముందు నుయ్యి వెనుక గొయ్యి

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Tuesday, May 18 2004

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంతవరకుమంత్రివర్గం ఏర్పాటు కాకపోవడం ప్రజాస్వామిక విలువలరీత్యాచూస్తే సమంజసం కాదు. మంత్రివర్గం ఏర్పాటులో రాజశేఖరరెడ్డికిఇబ్బందులు ఉన్నాయి. ఒకే కుటుంబానికి చెందిన అనేక మంది ఎంపీలుగాఎమ్మెల్యేలుగా ఎన్నికైనందున కేంద్రమంత్రివర్గంఏర్పాటైన తర్వాత గానీ రాష్ట్ర మంత్రుల ఎంపిక సాధ్యంకాదు.

మంత్రివర్గ సహచరుల ఎంపికలోరాజశేఖరరెడ్డికి ఉన్న సవాలక్ష సమస్యలు ఉన్నాయి.మంత్రివర్గం ఏర్పాటులో సామాజిక న్యాయం గురించి సీరియస్‌ గాఆలోచిస్తున్నానని ఆయన చెబుతున్నారు. ఈరోజురాజశేఖరరెడ్డికి మంత్రివర్గం ఏర్పాటులో ఎన్నిసమస్యలున్నాయో హామీలను నెరవేర్చడంలో అన్ని ఉన్నాయి.

ఉపముఖ్యమంత్రిగా తననునియమించమని పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌అధిష్టానవర్గంపై వత్తిడి తెచ్చారు. ఆయనను రాష్ట్రంలోఉంచడం మంచిదికాదని, కేంద్రంలో ఆయనను మంత్రిగాతీసుకోవాలని కాంగ్రెస్‌ అధిష్టానవర్గం ఆలోచిస్తోంది. తనమంత్రివర్గంలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లోలాగా రెడ్లకుఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదని భావిస్తున్నారు. బలహీనవర్గాలకుచెందిన యువ ఎమ్మెల్యేలకు ఆయన ప్రాధాన్యంఇవ్వాలనుకుంటున్నారు.

చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రైవేటు పవర్‌ప్లాంటుల మీద సమీక్షిస్తానని రాజశేఖరరెడ్డి ప్రకటించడంపైఆ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబు నాయుడుప్రైవేటు విద్యుత్‌ పాజెక్టుల విధానం వల్ల ఎక్కువ లాభపడిండిజివికె వంటి గ్రూపులే. జివికె వంటి వారు రాజశేఖరరెడ్డివంటి వారిని కూడా మేనేజ్‌ చేసుకోగలరు.

ఈ నేపధ్యంలో రాష్ట్ర రాజకీయరంగంఅత్యంత ఆసక్తికరంగా మారింది. మంత్రుల ఎంపిక జరిగినతర్వాత రాజశేఖరరెడ్డి మీద తొలి సవాలు రానుంది. ఆయనదానిని సమర్ధంగా ఎదుర్కోంటే ఆ తర్వాత పరిణామాలు మరోలాఉంటాయి.

  • ఎవరు గొప్ప?
  • ఆచితూచి అడుగులు
  • సవాళ్ళు ఎన్నో...
హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X