పార్టీ టికెట్ల మార్కెటింగు
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
రాజకీయాలు Tuesday, April 06 2004
హైదరాబాద్: మార్కెటింగేనేటి తారక మంత్రం. రాజకీయాల్లోను ఇది నిజమని రుజువు చేసేఉదంతమిది. యుపిలో తప్ప ఎపిలో అడ్రసు లేని ములాయం సింగ సమాజవాది జోరుగా నడుస్తున్నది.కాంగ్రెసు, టిడిపి టికెట్లు రాని డికె భరతసింహారెడ్డి, డికెఅరుణ డికె సమరసింహారెడ్డి ఇటీవల సమాజ వాది పార్టీలోచేరుతున్నట్టు ప్రకటించడం, పత్రికలు ఆ వార్తనుప్రముఖంగా ప్రకటించడం తెలిసిందే. తెరవెనుక కథనుఇక్కడ చదవండి.
కాంగ్రెసుకు మద్దతు ఇస్తున్న ఒకపత్రిక యజమానికి రాష్ట్రంలో ఎస్పీని ప్రమోటు చేస్తే అన్ని రకాలుగాలాభం ఉంటుందన్న ఆలోచన వచ్చింది. ఈ ఎన్నికల్లో కొందరుప్రముఖులనైనా ఎస్పీలో చేర్పించి హడావుడి చేయడానికి ఆయనప్రయత్నిస్తున్నారు.
ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జగదీషయాదవ యువకుడు.రాజకీయాలకు కొత్త. పత్రిక యజమాని అతనికి మాయ మాటలుచెప్పి ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేయించాడు. అందులో డికెభరతసింహారెడ్డి, డికె అరుణ ఇతర మహబుబ నగర జిల్లానాయకులను ప్రవేశపెట్టాడు. ఇదంతా ఆ రోజు ఈ విషయం ఆపార్టీపితామహుడైన ములాయంకు తెలియదు.
మరుసటి రోజుపత్రికా యజమాని ఎస్పీ ప్రధానకార్యదర్శి అమరసింగుకుఫోను చేసి తానే రాష్ట్రంలో ఎస్పీకి ఒక పేరు వచ్చేలా చేశానని, ఈఎన్నికల్లో అయినా ఎస్పీకి రాష్ట్రంలో కనీసం పాతిక సీట్లు వచ్చేలాచేయగలనని చెప్పాడు. ఇదంతా విని మతిపోయిన అమరన్నరాష్ట్ర శాఖ అధ్యక్షుడితో మాట్లాడారు. తనకు చెప్పకుండానే ఆపత్రిక యజమాని ఇవన్నీ చేస్తున్నాడని జగదీష వివరించాడు.
ఈఎన్నికల్లో ఎస్పీ టికెట్ల పంపిణీ బాధ్యతను తనకు అప్పగిస్తే అన్నీచేసిపెడతానని పత్రికా యజమాని ప్యాకేజి డీలు మాట్లాడుకోవాలనుకుంటున్నాడనిగ్రహించిన జగదీష హుటాహుటిన ఢిల్లీ వెళ్ళి జరిగిన విషయం అధిష్టానిని వివరించిమంగవారం హైదరాబాదుకు తిరుగు ప్రయాణం కట్టారు. కొన్ని సిద్ధాంతాలు గల ఎస్పీ టికెట్లనుమార్కెటు చేసే దళారులు అదీ పత్రికారంగంలో ఉన్నారంటేఆశ్చర్యంగా లేదా?
- చిరంజీవిరహస్య ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం హోంపేజి












Click it and Unblock the Notifications
