మోహం చాటేస్తున్న బాబు

తెలుగుదేశం తరఫున ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ మరో పక్క బాలకృష్ణ రోడ్ షోల ద్వారా దుమ్ము రేపుతుండగా కాంగ్రెస్ లో ఆ సినీ రంగుల హంగులు కరువయ్యాయి. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తారని నాగార్జునకు, మహేష్ బాబుకు (అన్నపూర్ణ, పద్మాలయ స్టూడియోలకు భూముల విషయంలో ప్రభుత్వం ఫేవర్ చేసింది) సహాయం చేసినా వాళ్ళిద్దరూ ఇప్పుడు గంభీరంగా రిజర్వుడుగా ఉంటున్నారు. వీళ్ళకి సహాయం చేసి తప్పు చేశానన్న నిర్ణయానికి వచ్చిన వైఎస్ తనకు ఈ విషయంలో సలహాలు ఇచ్చిన వారిని తీవ్రంగా తిడుతున్నట్టు సమాచారం. వైఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రెండు స్టూడియోల భూములకు సంబంధించి ఇచ్చిన రాయితీలను వెనక్కి తీసుకుంటారన్నది వైఎస్ మనస్తత్వం తెలిసిన వారందరికీ గుర్తెరిగిన సత్యమే.
గతంలో తాను రైతులకు, గ్రామీణ నిరుపేదలకు వ్యతిరేకిగా ఘన కీర్తి తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మనస్ఫూర్తిగా పర్యటించలేకపోతున్నారు. అప్పుడప్పుడూ వెళ్ళినా, టికెట్లు ఆశించే వారు జనాన్ని తరలించినా తన ప్రసంగాలకు జనం నుంచి స్పందన బాగా తక్కువగా ఉన్న విషయం గ్రహించిన చంద్రబాబు నందమూరి అందగాళ్ళ ప్రచారం మీదనే ప్రధానంగా ఆధారపడుతున్నారు.
కాంగ్రెస్ కే కాదు, తెలంగాణ రాష్ట్ర సమితికి కూడా స్టార్ అట్రాక్షన్ కరువైంది. విజయశాంతి మహాకూటమిలో భాగంగా టీఅర్ ఎస్ అభ్యర్ధిగా మెదక్ లోక్ సభ స్ధానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ముప్పై రోజులు ఆమె తన నియోజకవర్గంలో పర్యటించడానికే సరిపోతుంది. ఈ ఆర్టికల్ ను మీ మిత్రులకు పంపడానికి కింద ఉన్న "ఈమెయిల్" ఆప్షన్ పై క్లిక్ చేయండి.
(నాగార్జున, మహేష్ బాబు ఎందుకు కాంగ్రెస్ తరఫున ప్రచారానికి దూరంగా ఉంటున్నట్టు? రేపటి టాక్ ఆఫ్ టుడే లో చదవండి)












Click it and Unblock the Notifications