జగన్ వ్యూహం అమలు ఇక్కడే!

కేంద్రంలో సహాయ మంత్రి పదవికి ఒప్పుకోమని వీరప్ప మొయిలీ జగన్ కు చెప్పినట్టు తెలిసింది. అందుకు అంగీకరించబోనని ఆయన స్పష్టంగా చెప్పి, హైదరాబాద్ వెళ్ళిపోతానని బెదిరించినట్టు బయటికి వార్తలు వచ్చాయి. అప్పుడు మొయిలీ సోనియాతో మాట్లాడి ( అపాయింట్ మెంట్ అప్పటికే ఫిక్స్ అయి ఉంది) జగన్ అపాయింట్ మెంట్ పై మరోసారి కన్ ఫర్మేషన్ ఇవ్వాలని అభ్యర్ధించారట.
తమిళనాడుకు చెందిన వాసన్ పోస్టులోకి జగన్ ను తీసుకోవాలని మొదట కాంగ్రెస్ అధిష్టానవర్గం భావించింది. కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి అయిన వాసన్ కు కేబినెట్ ర్యాంక్ ఉంది. కేంద్రంలో సహాయ మంత్రి అంటే ఆంధ్రప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పోస్టుతో సమానం. ఆ పదవిని జగన్ కు ఇవ్వడానికి తమిళనాడు లాబీ అడ్డుపడినట్టు తెలుస్తోంది. జగన్ కు ఏ శాఖ ఇవ్వకపోయినా గతంలో కెసిఆర్ కు ఇచ్చినట్టు కేబినెట్ హోదా ఇచ్చి ఊరుకోవచ్చు.
కానీ అసలే కోపంగా ఉన్న జగన్ తో అటువంటి పరాచికాలు ఆడడానికి అధిష్టానవర్గం సిద్ధంగా లేదు. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా జగన్ తిరస్కరించారు. తన తండ్రి వైఎస్ అమలు చేసిన పథకాలు కొనసాగేలా చూస్తానని, అవి అమలు జరగకపోతే భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటానని చెప్పడం ద్వారా జగన్ రోశయ్యను భయంలోకి, అధిష్టానవర్గాన్ని మరో ఫీలింగ్ లోకి నెట్టి వేశారు.
ఇప్పుడు జగన్ వెనుక అనేక ఆచరణాత్మక శక్తులు ఉన్నట్టు కనిపిస్తోంది. జగన్ ఇప్పట్లో ఆ సిఎం క్యాంప్ కార్యాలయం నుంచి కదిలే అవకాశం లేదు. అందులో ఇప్పటికే ఆయనకు అనుకూలురైన రాయలసీమ నాయకులు బసచేసి ఉన్నారు.












Click it and Unblock the Notifications