హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ హీరో, ఆ సిన్మా జీరో!

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అతిధి పాత్రలో నటించిన సినిమా పరిస్ధితి ఏమిటి? ఎన్నికలలోపు ఆ సినిమా విడుదల అవుతుందా? సందేహమే. మన సినిమాలో ముఖ్యమంత్రి నటిస్తున్నారు..కాబట్టి కాంగ్రేస్ వాళ్ళంతా ఎగబడి చూస్తారు..ఇక మిగతాపార్టీల వాళ్ళు విమర్శించటానికైనా ఈ సినిమా చూస్తారు. పార్టీ ప్రచార చిత్రం కాబట్టి వైయస్ ఎలాగో మెచ్చుకుంటారు, పెట్టిన డబ్బు ఎలాగో శాటిలైట్ రైట్స్ ద్వారా వస్తుందని చెప్పి దర్శకుడు అరుణప్రసాద్..నిర్మాత సి.సి.రెడ్డిని ఒప్పించారు. సి.సి.రెడ్డి..వైయస్ కు దూరపు బంధువు కావంటం,రాష్ట్ర ప్రభుత్వ విదేశీ పెట్టుబడుల సలహాదారుడు కావటంతో ఈ ప్రాజెక్టు ఒక రూపం దాల్చింది. అయితే ఇప్పుడు పరిస్ధితి రివర్స్ లో ఉంది. పెట్టుబడి రెండు కోట్లు పూర్తయినా సినిమా ఒక కొలిక్కి రాలేదు. శాటిలైట్ మార్కెట్ లో కదలిక రాలేదు.

అప్పటికే శ్రేయాభిలాషి తీసి డబ్బులు పోగొట్టుకున్నా...అనే భావన సి.సి.రెడ్డి గారు పలు సందర్భాల్లో వ్యక్తం చేసారు. మరో ప్రక్క ఆయన ఇష్టపడి ప్రారంభించిన టీ..బిస్కట్..సమోసా సినిమా ఆగిపోయింది. మరో ప్రక్క విజయవాడలో ఆయన ప్రారంభించిన రియల్ ఎస్టేట్(అపార్ట్ మెంట్స్) వెంచర్ విజయవంతం కాలేదని సమాచారం. ఆయన గతంలో ప్రారంభించిన మొబైల్ ఫుడ్ సప్లయ్ ప్రాజెక్టు కూడా పడుకుంది. ఆయన నడుపుతున్న పత్రిక 'ఈభూమీ కూడా అంతంతమాత్రంగా నడుస్తోంది. ప్రధానంగా ఎడ్యుకేషన్ బిజినెస్ లో ఉన్న సిసి రెడ్డికి ఆర్ధిక మాంద్యం దెబ్బ తగిలింది. విదేశాల్లో విద్యావకాశాలు కల్పించే "విసు" సంస్ధకు ఇప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కమ్యూనిస్టు సిద్ధాంతాలు వల్లించే సిసి రెడ్డి అమెరికాలో వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించుకుని ఇండియా వచ్చి విసు సంస్ధను స్ధాపించారు.

ఈ నేపధ్యంలో ఈ సినిమా మరికొంత డబ్బు పెట్టి పూర్తి చేసినా ఎంతవరకూ తనకి పనికివస్తుందనే ఆలోచనలో ఆయన పడినట్లు చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర రెడ్డి ముఖ్యపాత్రలోనూ, బ్రహ్మానందం గోకరాజు గా ప్రధాన పాత్రలోనూ కనిపించనున్నారు. ఇక ఈ సినిమా లో బ్రహ్మానందం ట్రైబర్ గ్రామాలనుంచి వచ్చి ముఖ్యమంత్రిని కలసి తమ కష్టాలు చెప్పుకునే దశలో కథ నడుస్తుంది. అతని సమస్యలు విని ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించటం, ప్రభుత్వ పథకాల గొప్పతనం ఇందులో ఉంటుంది. గాడ్స్ మస్ట్ బి క్రేజీ లా కామెడీని ఇన్సఫైర్ అయి చేసారని టాక్. అలాగే అరుణ్ ప్రసాద్ ఈ చిత్రం ఊసు ఎత్తకుండా నవదీప్, భూమిక కాంబినేషన్ లో యాగం చిత్రం చేయటంలో బిజీ అయిపోయారు. గతంలో అరుణ్ ప్రసాద్..పవన్ కళ్యాణ్ హీరోగా తమ్ముడు చిత్రం రూపొందించారు. ఆ మధ్య సి.సి.రెడ్డి నిర్మాతగా గౌతమ్ ఎస్.ఎస్.సి అనే సినిమాను తీసి ఉన్నాడు. అదీ పెద్దగా వర్కవుట్ కాలేదు.

రాజశేఖరరెడ్డికి ఎన్నికల సమయంలో బాగా లాభించే అవకాశముంది కాబట్టి ఎవరైనా ముందుకు వస్తే ఈ సినిమా పూర్తవుతుంది. గత ఎన్నికల సమయంలో రాజశేఖరరెడ్డి అధికారంలో లేనప్పుడు సిసి రెడ్డీ గారు ఆయన పాదయాత్రకు ఆర్ధికంగా సహకరించారి. ఇప్పుడు సిసి రెడ్డి గారికి కూడా ఎవరో ఒకరి "చేయూత" అవసరం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X