రాష్ట్ర
ప్రజల
సంక్షేమం
పోలవరం
ప్రాజెక్టు
అంటూ
మాజీ
పార్లమెంటు
సభ్యుడు
వైయస్
జగన్మోహన్
రెడ్డి
తాను
చేపట్టిన
హరితయాత్రను
పూర్తి
అశ్లీల
యాత్రగా
మార్చారని
ఆరోపణలు
వినిపిస్తున్నాయి.
పోలవరం
సాధన
అంటూ
ఆయన
రావులపాలెం
నుండి
పోలవరం
వరకు
చేపట్టిన
యాత్రలో
క్యాబరే
డాన్సులు
వేయించి
రాష్ట్ర
ప్రజల
హృదయాలను
గాయపర్చారని
ఆరోపిస్తున్నారు.
ప్రజలకోసమంటూ
హరితయాత్ర
చేపట్టినప్పటికీ
ఎవరూ
ఆసక్తి
చూపక
పోవడంతో
తనతో
వచ్చే
వారి
ఆనందం
కోసం
అశ్లీల
నృత్యాలు
చేయించారని
అంటున్నారు.
యాత్రలో
బాహాటంగానే
అడవారితో,
మగవారితో
అశ్లీలంగా
డాన్సులు
చేయించడాన్ని
పలువురు
ప్రశ్నిస్తున్నారు.
యాత్ర
చేసింది
ఎంటర్‌టైన్‌మెంట్
కోసమా
లేక
పోలవరం
కోసమా
అని
ప్రశ్నిస్తున్నారు.
తనతో
రప్పించుకోవడానికి
కేవలం
అశ్లీల
నృత్యాలే
కాకుండా
జనాలకు
అద్దెకు
తీసుకు
వచ్చినట్లు
కూడా
ఆరోపణలు
వస్తున్నాయి.
ఒక్కరోజుకు
ఆడవారికి
వందరూపాయలు,
మగవారికి
నూటా
యాభై
రూపాయలు
ఇస్తామని
చెప్పినట్టు
కూడా
ఆరోపణలు
వచ్చాయి.
కాగా
కాంగ్రెస్
అధికార
ప్రతినిధి
తులసీరెడ్డి
జగన్
హరితయాత్రలో
అశ్లీల
నృత్యాలపై
ధ్వజమెత్తారు.
హరితయాత్ర
పేరుతో
క్యాబరే
డాన్సులు
వేయించడం
ఏం
సంస్కృతి
అని
ప్రశ్నించారు.
పోలవరం
కోసమంటూ
అశ్లీల
నృత్యాలతో
రప్పించుకోవాలని
అనుకోవడం
విడ్డూరమని
అన్నారు.
పోలవరం
గురించి
ఇప్పుడు
మాట్లాడుతున్న
జగన్
తాను
పార్లమెంటు
సభ్యుడిగా
ఉన్నప్పుడు
ఏం
చేశారని
ప్రశ్నించారు.
క్యాబరే
నృత్యాల
విషయం
వైయస్
జగన్‌కు
తెలుసా,
లేదా
అనేది
చెప్పలేం.
వాటిని
ఏర్పాటు
చేసింది
ఎవరనేది
కూడా
స్పష్టంగా
తెలియడం
లేదు.
కానీ,
జగన్
హరిత
యాత్రను
రంగుల
శృంగార
యాత్రగా
మార్చిన
వైనం
మాత్రం
నిజమేనని
స్థానికులు
అంటున్నారు.
Cabaret dances were organized in Ex MP YS Jagan's Polavaram haritha Yatra. It was entertained followers with cabaret dances, the comments were hearing. Congress leader N Tulasi Reddy also fired at Jagan on this issue. Tulasi Reddy questioned Jagan Why he had not raised Polavaram issue, when he was MP.
Story first published: Friday, February 11, 2011, 15:04 [IST]