ఎవరీ ఘరానా శ్రీలక్ష్మి?

ప్రభుత్వ పెద్దలకు సహకరిస్తూ తన విధేయతను ప్రదర్శించుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి ఇనుప గనుల మంజూరులో, వైయస్ అల్లుడు అనిల్ కుమార్ బినామీగా చెప్పుకుంటున్న రక్షణ స్టీల్స్‌కు బయ్యారం గనులను ఇనుప ఖనిజం గనులను కట్టబెట్టడంలో, పెన్నా సిమెంట్స్ ప్రతాప రెడ్డి సంస్థలకు బాక్స్టైట్, సున్నంరాయి గనుల మంజూరులో ఆమె అత్యంత ఉదారత ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. గనుల లీజుల్లో ప్రభుత్వ రంగ సంస్థలను పక్కన పెట్టి వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులైనవారికి కట్టబెట్టడంలో ఆమె ఇష్టానుసారంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి.
1988 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన శ్రీలక్ష్మి ఎక్కువ కాలం పురపాలక శాఖలో పనిచేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. పంచదార శాఖ కమిషనర్‌గా ఉన్న ఆమెను రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2006 మే 16వ తేదీన పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. అప్పటి ప్రభుత్వ సలహాదారుడు ఒక్కరి ద్వారా ఆమె ఈ కీలక పదవి పొందినట్లు సమాచారం. ఆమె పరిధిలో గనులు, లఘు పరిశ్రమలు ఉన్నాయి. లఘు పరిశ్రమలను చిన్న చూపు చూస్తూ ఆమె గనులపైనే పడ్డారనే వ్యాఖ్యలు వినిపిస్తాయి. దాదాపు నాలుగున్నర ఏళ్ల తన హయాంలో శ్రీలక్ష్మి ద్వారా 500కి పైగా గనుల లీజు కేటాయింపు, పొడగింపు జీవోలు జారీ అయినట్లు లెక్కలు చూపుతున్నారు. శాఖాపరమైన పర్యవేక్షణ, సమీక్షలు లేకుండా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయంతోనే ఆమె సంప్రదింపులు జరుపతుండేవారు. ముఖ్యమంత్రిగా రోశయ్య పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమెను 2009 అక్టోబర్ 6వ తేదీన అక్కడి నుంచి కదిలించారు.












Click it and Unblock the Notifications