విజయమ్మ పిల్: బాబుకు వరమా, శాపమా?

అయితే, సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) ద్వారా ఆమె చంద్రబాబుకు సంబంధించిన ఆస్తుల వివరాలను సేకరించినట్లు చెబుతున్నారు. ఇంతకు ముందు ఆర్‌టిఐ కమిషనర్‌గా పనిచేసిన దిలీప్ రెడ్డి వైయస్సార్ కుటుంబానికి సన్నిహితులు. ఆయన ద్వారానే వివరాలను సేకరించడం విజయమ్మకు సులభమైందని చెబుతున్నారు. చంద్రబాబు ఆస్తులపై వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్‌పై తెలుగుదేశం నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. చంద్రబాబుపై గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి పలు విచారణ సంఘాలను వేశారని, ఆ విచారణల్లో చంద్రబాబు తప్పు చేసినట్లు రజువు చేయలేకపోయారని అంటున్నారు.
కాగా, చంద్రబాబు ఆస్తులపై కోర్టులో పిటిషన్ వేసిన వైయస్సార్ దాన్ని ఉపసంహరించుకున్నారు. అది అప్పట్లో తీవ్రమైన వివాదాన్ని రేపింది. రుజువు చేయలేకనే వైయస్సార్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా, కాంగ్రెసు అధిష్టానానికి వైయస్ జగన్ దగ్గరవుతున్న క్రమంలోనే వైయస్ విజయమ్మ చంద్రబాబుపై పిటిషన్ వేశారని కూడా విమర్శలు వస్తున్నాయి. దీన్ని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కొట్టిపారేశారు. ఏమైనా, చంద్రబాబుకు తన నిజాయితీని నిరూపించుకునే అవకాశం లభించిందని అంటున్నారు. వైయస్ జగన్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యనే ఇప్పుడు కాంగ్రెసు పార్టీ నాయకులు చంద్రబాబుపై చేయడానికి సిద్ధపడ్డారు. అదే వ్యాఖ్య బొత్స సత్యనారాయణ చేశారు.












Click it and Unblock the Notifications