వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూ. ఎన్టీఆర్‌కు బాలయ్య ఝలక్, వంశీకి చివాట్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna-Jr Ntr
విజయవాడ: సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను చేరదీయడకూడదని, ఆయనను దూరంగానే పెట్టాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో పాటు బాబాయ్ బాలయ్య కూడా నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. దీంతో శనివారం విజయవాడలో ఓ కార్యక్రమానికి హాజరు కానున్న జూనియర్ ఎన్టీఆర్‌కు దూరంగా ఉండాలని బాలకృష్ణ తన అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సూచించినట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్‌కు దూరంగా ఉండాలని పార్టీ జిల్లా ముఖ్య నాయకులకు ఆయన సూచించినట్లు తెలుస్తోంది.

బాలయ్య సూచనలు అందిన వెంటనే తెలుగుదేశం కృష్ణా జిల్లా ముఖ్య నాయకులకు విషయాన్ని పార్టీ కార్యకర్తలకు చేరవేశారు. తాను తెలుగుదేశం పార్టీతోనే ఉంటానని, కొడాలి నానితో తనకు ఏ విధమైన సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ చెప్పినప్పటికీ కరుణించేందుకు బాలకృష్ణ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో చంద్రబాబు పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఎక్కడా కనిపించలేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కూడా రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చినవారికి చీవాట్లు తప్పలేదు.

కృష్ణా జిల్లా కంచికచర్లలో చంద్రబాబు పాదయాత్రలో తెలుగుదేశం విజయవాడ నాయకుడు వల్లభనేని వంశీ అభిమానులు కొంత మంది తెలియక జూనియర్ ఎన్టీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. అది తెలిసి చంద్రబాబు వంశీని తన బస్సులోకి పిలిచి చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్ పట్ల తాము అనుసరించదలుచుకున్న వైఖరిని చంద్రబాబు అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఓ వర్గాన్ని ప్రోత్సహిస్తూ చంద్రబాబుపై తిరుగుబాటుకు పూనుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, వైయస్సార్ కాంగ్రెసు పారటీలో చేరారు. దాంతోనే సరిపెట్టుకోకుండా, చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు, వ్యాఖ్యలు చేశారు. నాని వ్యవహారంలో తన ప్రమేయం లేదని జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన వినడానికి బాలయ్య గానీ చంద్రబాబు గానీ సిద్ధంగా లేరని చెబుతున్నారు.

పైగా, జూనియర్ ఎన్టీఆర్ అత్యుత్సాహం ప్రదర్శించారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఏదో ఒక రోజు తన చేతుల్లోకి వస్తాయని ఆయన అక్కడక్కడా చెబుతూ వచ్చారట. ఈ విషయాలు చంద్రబాబుకు, బాలయ్యకు చేరాయని చెబుతున్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ నుంచి తమకు ఉన్న ముప్పును వారు గ్రహించారని, దూరం పెట్టడమే మంచిదని నిర్ణయించుకున్నారని అంటున్నారు.

English summary
It is said that Nandamuri hero and Telugudesam party leader Balakrishna has instructed party workers and leaders to maintain distance from Jr NTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X