అమితాబ్ వచ్చినా, ఫోన్లు చేసినా చిరు దూరమే

ఆ రోజు చిరంజీవి హైదరాబాదులోనే ఉన్నారు. అంతర్జాతీయ పర్యాటక సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఆయన నగరంలోనే ఉన్నారని, ఆయనను సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని అంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవార్డుల ప్రదానం చేశారు. చిరంజీవిని స్వయంగా ఆహ్వానించడానికి సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి డికె అరుణ, కమిషనర్ దాన కిశోర్ తీవ్ర ప్రయత్నాలు చేశారు.
చిరంజీవి వస్తే అమితాబ్ బచ్చన్‌కు సౌకర్యంగా ఉంటుందని అందరూ భావించారు. దాంతో చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్‌ను కూడా సంప్రదించారు. అల్లు అరవింద్ సహాయంతో చిరంజీవిని సంప్రదించడానికి కూడా ప్రయత్నించారని చెబుతున్నారు. అంతర్జాతీయ సదస్సు ఏర్పాట్లలో చిరంజీవి తీరిక లేకుండా ఉన్నారని సమాధానం వచ్చినట్లు చెబుతున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డిని ఢీకొని రాష్ట్ర కాంగ్రెసుకు తానే దిక్కు అనే పరిస్థితి కల్పించడానికి చిరంజీవి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి పక్కన ఎంత తక్కువగా కనిపిస్తే అంత మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. తాను వస్తే నంది అవార్డుల ప్రదానోత్సవానికి ఎక్కువ ప్రచారం లభిస్తుందని, అలా జరిగితే కిరణ్ కుమార్ రెడ్డికి క్రెడిట్ దక్కుతుందని భావించి ఆయన దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications