ఫొటోలు: తాత బాటలో అప్పుడు జూ ఎన్టీఆర్
హైదరాబాద్: నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ తాజా విజయవాడ పర్యటన తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టించింది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి బెజవాడలో కాలు పెట్టిన ఎన్టీఆర్ పార్టీలో తాజా వివాదానికి, చర్చకు దారి తీశారు. జూనియర్ ఎన్టీఆర్ వద్దకు ఎవరూ వెళ్లకూడదని మరో నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ పార్టీ నాయకులను ఆదేశించినట్లు వార్తలు రావడం దుమారం రేపింది.
జూనియర్ ఎన్టీఆర్ విజయవాడ పర్యటనకు పార్టీ కార్యకర్తలు, నాయకులు దూరంగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పర్యటన విషయం తమకు తెలియదని పార్టీ కృష్ణా జిల్లా నాయకుడు రావి వెంకటేశ్వర రావు చెప్పారు. ఈ పరిణామంతో జూనియర్ ఎన్టీఆర్‌ను దూరం పెట్టాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ నిర్ణయించుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే, జూనియర్ ఎన్టీఆర్ విశేషంగా వచ్చన తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. అయితే, ఆయన రాజకీయాలు మాట్లాడలేదు.
తెలుగుదేశం పార్టీకి తాను వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఒకటి రెండు సార్లు చెప్పారు. అయినా, చంద్రబాబు పట్టించుకున్నట్లు కనిపించలేదు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చిక్కకుండా జూనియర్ ఎన్టీఆర్ వారసత్వ పోరును ముందుకు తెచ్చారనే చర్చ కూడా విరివిగానే జరుగుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఎర్రంనాయుడు వంటి సీనియర్ పార్టీ నేత జూనియర్ ఎన్టీఆర్ వెనక నిలబడి ప్రచారంలో పాల్గొన్నారు. ఇది చూస్తే టిడిపి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చునని అప్పట్లో వ్యాఖ్యానాలు వినిపించాయి.

ఎన్నికల ప్రచారంలో ఇలా స్టయిల్‌గా జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లో...

శ్రమశక్తికి, కార్మికవర్గానికి సంకేతంగా ఎన్టీ రామారావు తన పర్యటనల్లో ఖాకీ దుస్తులు వాడారు. అదే రీతిలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంలో ఖాకీ దుస్తులు వాడారు.

అశేష జనవాహినిని ఉద్దేశించి అచ్చమైన రాజకీయ నాయకుడిలా జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగాలు చేశారు.

ఎన్టీ రామారావు ప్రచార రథం వాడేవారు. అదే రీతిలో తాత ఫొటో, తన ఫొటో ఉన్న వాహనంపై నుంచి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించారు.

రాజకీయంలో జూనియర్ ఎన్టీఆర్ తాతగారిని అనుకరించడానికి ప్రయత్నించారు కాబోలు.. కాంగ్రెసుపై వాగ్బాణాలు సంధిస్తూ ఆయన ప్రసంగాలు సాగాయి.

ఎన్నికల ప్రచారంలో ఇలా కిందనే అన్న పానీయాలు చేస్తూ...

జూనియర్ ఎన్టీఆర్ ప్రచార ప్రసంగాలకు పెద్ద యెత్తున ప్రజలు వచ్చారు. కానీ ఆయన ప్రచారం కూడా తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం చేకూరలేదని ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.

ఎన్నికల ప్రచారంలో ఇలా కిందనే...

ఎన్నికల ప్రచారంలో ఇలా బడుగులను అక్కున చేర్చుకునే ప్రయత్నం జూనియర్ ఎన్టీఆర్ చేశారు.

ప్రచారం ముగించుకుని వస్తూ రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడ్డారు.

జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ ఇటీవలి విజయవాడ పర్యటనలో తన అభిమానుల శక్తిని చాటుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్‌కు తండ్రి నందమూరి హరికృష్ణ మద్దతు పుష్కలంగా ఉందని చెబుతున్నారు. చంద్రబాబు పాదయాత్రలో రెండు మూడు సార్లు కనిపించిన హరికష్ణ ఎక్కువ సమయం దూరంగానే ఉంటున్నారు. దాదాపుగా హరికృష్ణ కూడా చంద్రబాబుకు దూరమైనట్లేనని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన విజయవాడ పర్యటన గత ఎన్నికల్లో చేసిన ప్రచార కార్యక్రమాన్ని గుర్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications