వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రంపై కన్ను: టి నోట్‌పై షిండే 'ఆంటోని' మెలిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sushil Kumar Shinde
సిడబ్ల్యూసి విభజన నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితుల పైన కేంద్రం దృష్టి సారించింది. ప్రకటన అనంతరం సీమాంధ్రలో ఆందోళనలు, హైదరాబాదులో ఘర్షణ వాతావరణంపై ప్రధానమంత్రి నివాసంలో జరిగిన కోర్ కమిటీలో దాదాపు రెండు గంటల పాటు చర్చ జరిగింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంటోని హాజరు కాలేదు.

తెలంగాణపై కేబినెట్ నోట్ ముసాయిదా, హైదరాబాద్‌పై వివిధ ప్రతిపాదనల గురించి హోంమంత్రి షిండే కోర్ కమిటీ సభ్యులకు వివరించినట్లుగా సమాచారం. అయితే, దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలన్న దానిపై స్పష్టత రాలేదు. తెలంగాణ అంశం, రాష్ట్ర పరిస్థితిపై చర్చలు జరిగాయని, నిర్ణయం మాత్రం తీసుకోలేదట. ఆంటోనీ కమిటీ నివేదిక కోసం వేచి చూడాలని కూడా కోర్ కమిటీ సభ్యులు భావించినట్లు తెలిసింది.

మరోవైపు శనివారం ఉదయం సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలు హోంమంత్రి షిండేను కలిశారు. ఆ సమయంలో వారితో షిండే మాట్లాడుతూ.. తెలంగాణపై కేబినెట్ నోట్ పంపించి తన బరువు దించుకుంటానని, ఆ తర్వాత రాష్ట్రపతి ఇష్టమని సీమాంధ్ర నేతలతో వ్యాఖ్యానించారని తెలుస్తోంది. అయితే, ఆ నోట్ ఆంటోని కమిటీ నివేదిక తర్వాతనే ఉంటుందని చెప్పారు. సమైక్యాంధ్ర పైన ఆయన వారి వద్ద చేతులెత్తేశారు.

కేబినెట్ నోట్ తయారు చేసి పంపక తప్పదని, దాంతో తన బాధ్యత పూర్తవుతుందని, ఆ నోట్ మాత్రం ఆంటోని కమిటీ నివేదిక తర్వాతనే ఉంటుందని చెప్పారు. రాష్ట్రపతి వద్దకు వెళ్లాక ఆయన ఇష్టమని చెప్పారు. తీర్మానం అసెంబ్లీకి వెళ్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని, ఈ అంశం చివరకు పార్లమెంటులో తేలాల్సిందేనని వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

English summary
It is said that Central Home Minister Sushil Kumar Shinde on Saturday told Seemandhra leaders that cabinet not only after Antony Committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X