టి: చెన్నైలో బాబు చక్రం, షిండేకీ తప్పలేదు(పిక్చర్స్)
న్యూఢిల్లీ/చెన్నై: తెలంగాణ విషయంలో కేంద్రం దూకుడుగా వెళ్తుండగా రాష్ట్రానికి చెందిన నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. రాష్ట్ర విభజనను అంగీకరించమని సీమాంధ్ర నేతలు, ఇచ్చిన మాట ప్రకారం అధిష్టానం పూర్తి చేస్తుందని కాంగ్రెసు తెలంగాణ నేతలు చెబుతున్నారు.
సీమాంధ్ర ప్రాంతానికి ఏం కావాలో ఆ ప్రాంత నాయకులు అడిగితే బాగుంటుందని, అది చెప్పకుండా బిల్లును అడ్డుకుంటామంటూ అభ్యంతరకరంగా వ్యవహరించడం తగదని తెలంగాణ రాష్ట్ర సమితి మాజీ ఎంపి వినోద్ సూచించారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చెన్నై వెళ్లి జయలలిత, కరుణానిధిలను కలిశారు. మరోవైపు ఢిల్లీలో పార్లమెంటులో పరిస్థితి ఎప్పటిలాగే ఉండటంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి.

కరుణానిధితో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డిఎంకె అధ్యక్షులు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కలిసిన దృశ్యం.

జయతో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నాడిఎంకె అధ్యక్షురాలు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో భేటీ అయిన దృశ్యం.

జూపూడి
గురువారం దేశ రాజధాని న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకులు జూపూడి ప్రభాకర రావు.

టి మంత్రులతో జూపూడి
గురువారం దేశ రాజధాని న్యూఢిల్లీలో తెలంగాణ ప్రాంత మంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర రావు.

సీమాంధ్ర టిడిపి
గురువారం దేశ రాజధాని న్యూఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన అనంతరం రాష్ట్రపతి భవన్‌లో మాట్లాడుతున్న సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేత సిఎం రమేష్.

రాజ్‌తో కెసిఆర్
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

రాజ్‌తో కెసిఆర్
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

ప్రకాశ్ జవదేకర్
గురువారం దేశ రాజధాని న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్.

జివోఎం 1
గురువారం మంత్రుల బృందం (జివోఎం) సమావేశం సమయంలో మాట్లాడుకుంటున్న కేంద్రమంత్రులు గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, నారాయణ స్వామి.

జివోఎం 2
గురువారం మంత్రుల బృందం (జివోఎం) సమావేశం సమయంలో మాట్లాడుకుంటున్న కేంద్రమంత్రులు గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీలు.

జివోఎం 3
గురువారం మంత్రుల బృందం (జివోఎం) సమావేశం సమయంలో మెటల్ డిటెక్టర్ దాటుతున్న కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే.

జివోఎం 4
గురువారం మంత్రుల బృందం (జివోఎం) సమావేశం సమయంలో మెటల్ డిటెక్టర్ దాటుతున్న కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, జైరామ్ రమేష్.












Click it and Unblock the Notifications