మోడీని తట్టుకోలేకపోతున్న పాక్!: కుయుక్తులు

న్యూఢిల్లీ: యూరి దాడికి ప్రతిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ధీటైన చర్యలు పాకిస్తాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో గతంలో కంటే ఎక్కువగా పాక్ రెచ్చిపోతోంది. బారాముల్లాలో, ఆ వెంటనే గంటల్లో పంజాబ్ గురుదాస్‌పూర్‌లో కాల్పుల ఉల్లంఘన జరిపింది.

ఐక్య రాజ్య సమితిలో ఏకాకి కావడం, తమను టార్గెట్‌గా చేస్తూ సార్క్ సమావేశాలు వాయిదా పడటం, చాలా దేశాలు ఉగ్రవాదం విషయంలో పాక్ వైపు వెలెత్తి చూపిస్తున్న నేపథ్యంలో పాక్.. భారత్‍ పైన రెచ్చిపోతోంది. సరిహద్దుల్లో వరుసగా కాల్పులు జరుపుతోంది. బారాముల్లా, గురుదాస్ పూర్, పూంచ్.. ఇలా కొన్ని గంటల వ్యవధిలోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

యూరీకి ప్రతీకారం..

యూరీకి ప్రతీకారం..

ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్‍‌ను మోడీ ప్రభుత్వం ఏకాకిని చేసింది. ఉగ్రవాదం విషయంలో ఆ దేశాన్ని బోనులో నిలబెట్టారు. దీనిని పాకిస్తాన్ ఏమాత్రం జీర్ణించుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం విషయంలో పాక్‌ను ఏకాకిని చేశారు. యూరి ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఐక్య రాజ్య సమితిలో పాక్‌ను ఏకాకిని చేసింది. సార్క్ సమావేశాలు రద్దయ్యేలా చేసింది. పైగా, సార్క్ దేశాలతో పాటు అమెరికా సహా అన్ని దేశాలు పాక్ వైపు ఉగ్రవాదం విషయంలో వేలెత్తి చూపించాయి.

సర్జికల్ స్ట్రయిక్ పైన ముందే సమాచారం

సర్జికల్ స్ట్రయిక్ పైన ముందే సమాచారం

ఆ తర్వాత సర్జికల్ స్ట్రయిక్ ద్వారా పాక్‌కు షాకిచ్చింది. దీనిని సార్క్ దేశాలైన బంగ్లాదేశ్ తదితర దేశాలు సమర్థించాయి. పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తుందని చెబుతూ సార్క్ సమావేశాలు రద్దయ్యాయి. ఆ తర్వాత శ్రీలంక కూడా షాకిచ్చింది. అంతేకాదు, సర్జికల్ స్ట్రయిక్ దాడులను భారత్ ముందే.. అమెరికా, గల్ఫ్ దేశాలకు సమాచారం అందించిందని తెలుస్తోంది. ఇలా వ్యూహాత్మకంగా భారత ప్రభుత్వం వ్యవహరించింది. దీంతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

ఎన్నో ఎత్తులు

ఎన్నో ఎత్తులు

యూరి ఉగ్రదాడికి ప్రతిగా భారత్.. పాక్ పైన ప్రతీకారం కోసం ఎన్నో ఎత్తులు వేసింది. అందులో కొన్ని అమలు చేసింది. సింధు జలాలను పూర్తిస్థాయిలో వాడుకోవడం (మన వాటా) ద్వారా ఆ దేశానికి కౌంటర్ ఇవ్వాలనే ఆలోచన చేస్తోంది. దానిపై సమాలోచనలు సాగుతున్నాయి. అలాగే పాక్‌కు ఇచ్చిన ప్రత్యేక దేశం హోదా పైన కూడా ఈ వారంలో తేల్చనున్నారు.

పాక్ ప్రతిదాడిపై..

పాక్ ప్రతిదాడిపై..

సర్జికల్ స్ట్రయిక్ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రతిదాడులు చేయవచ్చుననే దాని పైన కన్నేశారు. ఏ రకంగా ప్రతిదాడి చేయవచ్చునో అంచనాకు వచ్చారు. వివిధ మార్గాల్లో పాక్ ప్రతీకారం తీర్చుకోవచ్చునని ఆ దేశ వ్యూహాలపై సైనిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే వాటి ద్వారా జరిగే పర్యవసనాల కూడా విశ్లేషిస్తున్నారు.

పాక్ వ్యూహాలపై..

పాక్ వ్యూహాలపై..

భారత్‌లోకి ఉగ్రవాదులను పంపించి ముంబై తరహా దాడులు చేసే అవకాశం అందులో ఒకటి. సరిహద్దుల్లో సైనిక శిబిరాలపై ఉగ్రదాడులు. ఇలాంటివి ఇప్పటికే జరుగుతున్నాయి. బారాముల్లా, గురుదాస్ పూర్‌లో దాడులు జరిగాయి. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్నారు. అలాగే, ప్రత్యేక పాక్ బలగాలతో కూడా దాడి జరగవచ్చునని ముందే అంచనా వేశారు. చివరగా భారత్ మిత్రదేశాల పైన దాడి చేయవచ్చునని అంటున్నారు. ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లు మనకు మిత్రదేశాలు. ఆ దేశాల పైన దాడి లేదా ఆ దేశాల్లో అంతర్గతంగా చిచ్చు పెట్టవచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+