రాముడి కోసం ఎపిలో ఫైట్: బాబు కింకర్తవ్యం?

హైదరాబాద్: భద్రాచల రాముడు తెలంగాణ రాష్ట్రంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ప్రధాన ఆలయాల మధ్య పోరాటం ప్రారంభమైంది. రాష్ట్ర విభజన ఆ పోరాటానికి దారి తీసింది. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని ప్రముఖ రామాలయం ఆంధ్రప్రదేశ్‌లో లేదు. విభజనలో భాగంగా అది తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. ప్రభుత్వ అధికారిక నిర్వహణ కోసం రాయలసీమ, ఉత్తారంధ్రలోని రెండు ప్రధానాలయాలు పోటీ పడుతున్నాయి.

శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి సీతారాములకు సిల్కు వస్త్రాలు ప్రదానం చేయడం సంప్రదాయంగా వస్తోంది. భద్రచాలం డివిజన్‌లోని ఏడు మండలాలు విభజనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేరగా, రామాలయం ఉన్న భద్రాచలం మాత్రం తెలంగాణలో ఉండిపోయింది. దాంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ రామనవమి సందర్భంగా బద్రాచల రాముడికి సిల్కు వస్త్రాలు ఇచ్చే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అవకాశం లేదు. దీంతో రాయలసీమలోని ఓ ఆలయం, ఉత్తరాంధ్రలోని మరో ఆలయం ఆ అవకాశం కోసం పోటీ పడుతున్నాయి.

It's a fight for Rama in Andhra Pradesh

శ్రీరామనవమి సమీపిస్తుండడతో రాయలసీమలోని కడప జిల్లా ఒంటిమిట్టలకు చెందిన కోదండరామాలయం అధికారులు, ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయం అధికారులు పోటీ పడి, తమ ఆలయంలో సిల్కు వస్త్రాలు సమర్పించాలంటే, తమ ఆలయంలో సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఒత్తిడి తెస్తున్నారు.

విజయనగరం జిల్లాలోని నెల్లమమర్ల మండలంలో గల రామతీర్థ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య కాలానికి చెందింది. వనవాసం సందర్భంగా రాముడు అక్కడికి వచ్చాడని నమ్ముతారు. దీంతో ప్రభుత్వం అధికారికంగా శ్రీరామ నవమి ఉత్సవాలను ఇక్కడే జరపాలని అడుగుతున్నారు.

కాగా, కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలాయంలో ప్రభుత్వం అధికారికంగా శ్రీరామ నవమి ఉత్సవాలను నిర్వహించాలని అక్కడివారు అడుగుతున్నారు. చంద్రబాబును ఒప్పించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నట్లు ఓ ప్రముఖ దినపత్రికలో వార్తాకథనం వచ్సింది. సీత ఈ ప్రాంతానికి వచ్చిందని, ఆలయం 600 ఏళ్లనాటిదని ప్రజలు నమ్ముతారు. ఏయితే, చంద్రబాబు దేనికి గుర్తింపు ఇస్తారో వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+