వాజ్‌పేయిని ఒక్క ఓటుతో గద్దె దించింది అమ్మనే!

అప్పట్లో కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో కూలిపోయింది. అలా కూలిపోవడానికి అమ్మ జయలలితనే కారణం. వాజ్‌పేయిపై అపరిమితమైన అభిమానం ఉన్నప్పటికీ ఆమె ఆ పనిచేశారు.

న్యూఢిల్లీ: అటల్ బిహారీ వాజ్‌పేయి పురచ్చితలైవి మెచ్చిన నాయకుడు. తమిళ ప్రజలు అమ్మగా, పురచ్చితలైవిగా కొలిచే జయలలితకు వాజ్‌పేయి అంటే అపరిమితమైన అభిమానం. అయితే, 1999లో వాజ్‌పేయి ప్రభుత్వం కూలిపోవడానికి జయలలితనే కారణమయ్యారు.

People Pay Homage To Former TN CM J Jayalalithaa

ఒక్క ఓటుతో అప్పట్లో వాజ్‌పేయి ప్రభుత్వం కూలిపోయింది. అప్పటి మిత్రుడు, జనతా పార్టీ నేత సుబ్రమణ్యస్వామి మాటలు విని, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చేతులు కలిపి అప్పట్లో ఆయన ప్రభుత్వాన్ని కూల్చడంలో జయలలిత కీలకపాత్ర పోషించారు

Jayalalithaa made Vajpayee government to collapse

ఆ తర్వాత సుబ్రహ్మణ్యస్వామి ఆమెకు బద్ధ శత్రువుగా మారారు. అయితే, తనకు ఎంతో ఇష్టమైన వాజ్‌పేయి ప్రభుత్వాన్ని కూల్చినందుకు ఆమె చాలాసార్లు ఆవేదిన వ్యక్తం చేసినట్లు చెబుతుంటారు.

కాగా, జయలలిత ప్రత్యర్థులపై కత్తులు నూరుతారనే విషయమే ఎక్కువ మందికి తెలుసు. కానీ ఆమె కొన్ని పద్ధతులు పాటించారనే విషయం తమిళనాడులోని టీవీ చానెళ్ల తీరుతెన్నులను చూస్తే అర్థమవుతుంది. తమిళనాడులో దాదాపు అన్ని ప్రధాన పార్టీలకు సొంత చానళ్లున్నాయి.

Jayalalithaa made Vajpayee government to collapse

కరుణానిధి నేతృత్వంలోని డీఎంకేకు 'కలైంజర్‌', 'సన్‌' చానళ్లున్నాయి. అన్నాడీఎంకేకు మద్దతుగా 'జయా' టీవీ ఉంది. తమ తమ పార్టీల ప్రచారానికి వాటిని వాడుకుంటూ ఉంటారు. ప్రత్యర్థులను దెబ్బ తీయడానికి ఎవరికి వారు ప్రయత్నించినప్పటికీ చానెళ్లను అడ్డుకునే సంప్రదాయం మాత్రం లేదు.

సన్‌టీవీ గ్రూపున కు చెందిన సన్‌ డీటీహెచ్‌లో జయా టీవీ కార్యక్రమాలు ముందు వరుసలోనే ఉంటాయి. అలాగే అన్నాడీఎంకే ప్రవేశపెట్టిన 'అరసు కేబుల్‌ కార్పొరేషన్‌'లో కలైంజర్‌, సన్‌ టీవీ, చానళ్లు ప్రైమ్‌ బ్యాండ్‌లోనే ఉన్నాయి. జయలలిత రాజకీయ ప్రత్యర్థుల చానెళ్ల జోలికి వెళ్లలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+