చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలిత ఆరోగ్యం: తాత్కాలిక సీఎంపై డైలమా

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత దాదాపు ఇరవై రోజులగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జయ ఆసుపత్రిలో ఉన్నందున ఒకరిని మధ్యంతర ముఖ్యమంత్రిగా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జయ ఆరోగ్యం బాగయ్యే వరకు ఒకరిని సీఎంగా చేయాలని అడుగుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్ద లేదా ముఖ్యమంత్రి అందుబాటులో లేని సమయంలో మధ్యంతర ముఖ్యమంత్రి ఉండాలని మన రాజ్యాంగం చెబుతోందా అనే చర్చ కూడా సాగుతోంది. అయితే, మన రాజ్యాంగంలో ఇలాంటి విషయమై మన రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఎక్కడా ప్రస్తావించలేదని అంటున్నారు.

పార్టీ, భవిష్యత్తుపై అజిత్‌కు చెప్పిన జయలలిత, వారసుడిగా వీలునామా!పార్టీ, భవిష్యత్తుపై అజిత్‌కు చెప్పిన జయలలిత, వారసుడిగా వీలునామా!

ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలనేది భారత రాజ్యాంగంలో లేదని అంటున్నారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీస్ సూచనలు, సలహాల మేరకు గవర్నర్ చూస్తారు. అదే సమయంలో అధికార పార్టీ మధ్యంతర ముఖ్యమంత్రిని నియమించవచ్చునని అంటున్నారు.

 Jayalalithaa

కాగా, ఇప్పుడు జయలలిత అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సరిగ్గా నలభై రెండేళ్ల క్రితం అన్నాడీఎంకే ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. 1984లో ఈ పరిస్థితిని ఎదుర్కొంది. 1984 అక్టోబర్ 5వ తేదీన నాటి ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ ఆసుపత్రిలో చేరారు.

ఆయనను ఆ తర్వాత అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలో ఉండటంతో పలువురు నాయకులు విజిట్ చేశారు. రామచంద్రన్ మరికొద్ది రోజులు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. దీంతో నాటి గవర్నర్ ఎస్ఎల్ ఖురానా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు.

నాటి గవర్నర్ నాడి అడ్వోకేట్ జనరల్‌ను కలుసుకున్నారు. నాటి పరిస్థితి నేపథ్యంలో సూచనలు అడిగారు. ఆర్థిక మంత్రి వీఆర్ నేదుంచేజియన్.. గవర్నర్‌ను కలిశారు. తనను పాలన కొనసాగించాలని ఎంజీఆర్ తనకు సూచించారని గవర్నర్‌తో చెప్పారు. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి అందుబాటులో లేనందున మంత్రివర్గం ఎలాంటి పెద్ద పాలసీల పైన నిర్ణయం తీసుకోవద్దని చెప్పారు.

ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ, ప్రయివేటు సెక్రటరీలు ఆర్థిక మంత్రి నేదుంచేజియన్‌ను ఇంచార్జ్ బాధ్యతలు తీసుకునేలా చేశారు. ఆ తర్వాత నేదుంచేజియన్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కేబినెట్ కమిటీ ఎంజీఆర్‌ను చికిత్స నిమిత్తం న్యూయార్క్ తరలించాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఖర్చులు భరించాలని నిర్ణయించారు.

English summary
In the past week, there has been a call by several members in the Tamil Nadu opposition to appoint an interim Chief Minister since J Jayalalithaa is recovering in hospital. The question is, whether the Constitution provides for the appointment of an interim chief minister when the head of the government is not in a position to take decisions?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X