జాతీయ దుమారం: కెసిఆర్ వర్సెస్ రాధాకృష్ణ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ఎబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ పోరును ముమ్మరం చేసినట్లు కనిపిస్తున్నారు. వరంగల్ కాళోజీ శత జయంతి కార్యక్రమంలో కెసిఆర్ మీడియాపై చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 చానెళ్ల నిలిపివేతతో తమకు సంబంధం లేదంటూనే కెసిఆర్ మీడియాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాదులో మీడియా ప్రతినిధుల ఆందోళనలతోనూ జాతీయ మీడియా సంస్థల చర్చలతోనూ వాతావరణం వేడెక్కింది.
టైమ్స్ నౌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధాకృష్ణ కెసిఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ తనయుడు కెటి రామారావు సెటిల్మెంట్లను బయటపెట్టినందుకే తమపై కెసిఆర్ కక్ష గట్టారని ఆయన ఆరోపించారు. కాగా, టైమ్స్ నౌ బుధవారం రాత్రి ఓ చర్చా గోష్టిని కూడా నిర్వహించింది. ఈ చర్చా గోష్టిని నిర్వహించిన అర్ణబ్ కెసిఆర్‌పై తీవ్రంగా దుయ్యబట్టారు. హిట్లర్ సిఎం అంటూ, ప్రభుత్వాన్ని నడుపుతున్నారా... స్ట్రీట్ గ్యాంగ్‌ను నడుపుతున్నారా అంటూ ఆయన దుమ్మెత్తిపోశారు.
టీవీ9 చేసిన వ్యాఖ్యలనే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ప్రస్తావిస్తున్నారు తప్ప తాము చేసిన తప్పేమిటో చెప్పడం లేదని ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ అంటున్నారు. 21 శతాబ్దపు హిట్లర్ ముఖ్యమంత్రి అంటూ కెసిఆర్‌పై టైమ్స్ నౌ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. కెసిఆర్‌ది హంతక భాష అని వ్యాఖ్యానించింది.

ఎన్టీడిటీవి కూడా ప్రత్యేకంగా చర్చా గోష్టి నిర్వహించింది. ఈ చర్చా గోష్టిలో రాధాకృష్ణ, కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. కవిత తన తండ్రి కెసిఆర్ వ్యాఖ్యలను సమర్థించారు. కుల్దీప్ నయ్యర్, వినోద్ మెహతా, వెంకట్ నారాయణ, రాజ్‌దీప్ సర్దేశాయి వంటి ప్రముఖులు కెసిఆర్ తీరును తప్పు పట్టారు.
మరోవైపు, తెలంగాణలో ప్రతిపక్షాలు కూడా మీడియాపై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఆసరా చేసుకుని రాజకీయ దాడిని పెంచాయి. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు కాంగ్రెసు నాయకులు, బిజెపి నాయకులు కెసిఆర్ మీడియా పట్ల అనుసరిస్తున్న తీరును తప్పుపడుతున్నారు. కెసిఆర్‌పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో కూడా రాజకీయ నాయకులు మీడియా జగడంపై ప్రతిస్పందించాల్సిన స్థితిలో పడ్డారు. ప్రస్తుత వివాదాన్ని కెసిఆర్ వర్సెస్ మీడియాగా ముందుకు తేవడానికి ఆంధ్రజ్యోతి యాజమాన్యం ప్రయత్నిస్తుండగా, తెలంగాణ వర్సెస్ మీడియాగా కెసిఆర్ ముందుకు తెస్తున్నారు.
మీడియా నిష్పక్షపాతంగా ఏమీ లేదనే విషయం మేధావులే కాదు, సాధారణ ప్రజలు కూడా గుర్తించారు. ఈ స్థితిలో ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, కెసిఆర్‌కు మధ్య తలెత్తిన సమరం ఎంత దూరం పోతుందనే విషయంపై మాత్రం ప్రజల్లో నెలకొని ఉంది.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications