కిరణ్ పార్టీ గుర్తు పాదరక్షలు: వాకితో... (పిక్చర్స్)
హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీపై కసరత్తు ముమ్మరం చేశారు. రాజీనామా చేసినప్పటి నుండి ఆయన వరుసగా పలువురు నేతలతో భేటీ అవుతున్నారు. కొత్త విషయంలో నాలుగు పేర్ల పైన తర్జన భర్జన పడిన కిరణ్... జై సమైక్యాంధ్ర వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది.
పార్టీ జెండాగా కూడా జై సమైక్యాంధ్ర జెండానే ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. పార్టీ గుర్తుగా పాదరక్షలు ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. తెలుగు వారికి తాము రక్షగా ఉన్నామని చెప్పేందుకే పాదరక్షలను ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. మార్చి మొదటి వారంలో ఆయన కొత్త పార్టీని ప్రకటించే అవకాశముంది.
ఆయన సీమాంధ్ర ప్రాంత బహిష్కృత ఎంపీలతో ఆది, సోమవారాల్లో భేటీ అయ్యారు. సోమవారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. మంగళవారం వివిధ రంగాల మేథావులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. రేపు విద్యార్థి సంఘాల నేతలతో భేటీ అయ్యే అవకాశముంది. కాగా, జై సమైక్యాంధ్ర పార్టీ శ్రీహరి రావు పేరుతో రిజిస్టర్ అయినట్లుగా తెలుస్తోంది.

కిరణ్ 1
కొత్త పార్టీ ఏర్పాటుపై మేథోమథనం చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తాను కొత్త పార్టీ పెడుతున్నానని, ఎవరు తనతో వస్తారో చెప్పాలని ఆయన సన్నిహితులను కోరుతున్నారు.

కిరణ్ 2
ఎమ్మెల్యేలు కూడా కిరణ్ కొత్త పార్టీ ఖాయమన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆదివారం పార్లమెంట్ సభ్యులతో చర్చించిన ఆయన సోమవారం ఇద్దరు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.

కిరణ్ 3
మంగళవారం కూడా ఆయన మరో విడత కీలక సమావేశాన్ని సన్నిహితులతో నిర్వహించి బుధవారం కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం.

కిరణ్ 4
ఇదే సమయంలో కొత్త పార్టీ ఏర్పాటుపై విధి విధానాలు ఎలా ఉండాలి, జనంలోకి ఎలా వెళ్లాలి అన్న అంశాలపై కూడా ఆయన తనను కలిసిన వారితో చర్చిస్తున్నారు.

కిరణ్ 5
ప్రధానంగా సమైక్యం ఒక్కటే నినాదంతో వెళ్లాలని భావిస్తున్న కిరణ్ అందుకు అవసరమైన వేదికను సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నారు.

కిరణ్ 6
యువత, విద్యార్థి, ఉద్యోగులను ఆకర్షించడం ద్వారా జనంలోకి వెళ్లాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి యోచిస్తున్నట్లు చెబుతున్నారు.

కిరణ్ 7
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీపై కసరత్తు ముమ్మరం చేశారు. రాజీనామా చేసినప్పటి నుండి ఆయన వరుసగా పలువురు నేతలతో భేటీ అవుతున్నారు.












Click it and Unblock the Notifications