పవన్ కల్యాణ్‌ సంకేతాలు: పొత్తుకు లెఫ్ట్ ఉవ్విళ్లు?

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ బిజెపిపై నిప్పులు చెరుగుతున్న ప్రస్తుత తరుణంలో వామపక్షాలు ఆయన వైపు ఆశగా చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు చెందిన జాతీయ నాయకులు పవన్ కల్యాణ్ విషయంపై స్పందించారు.

వామపక్షాల పట్ల పవన్ కల్యాణ్ సానుకూల వైఖరి ప్రదర్శించారు. దాంతో వామపక్షాలు ఆయనతో కలిసి ఫ్రంట్ కట్టే ఆలోచన చేయవచ్చునని అంటున్నారు. ఇప్పటికే సినీ హీరో శివాజీ సిపిఐతో కలిసి పనిచేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ బంద్ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.

Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో భ్రమలు సృష్టిస్తున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కేంద్రంపై విరుచుకుపడ్డారు. విభాజిత ఏపీకి ప్యాకేజీ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్లు హోదా ఇస్తామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారని గుర్తు చేశారు.

ఏపీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వామపక్షాలతో కలిసి పనిచేయాలనుకోవడం మంచి పరిణామమన్నారు. పవన్ కల్యాణ్ తమ పార్టీతో కలిసి పనిచేయడంపై రాష్టక్రమిటీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

ప్రత్యేకహోదా ఇవ్వడం ఇష్టం లేకనే కేంద్ర ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపుతోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రత్యేక హోదా సంజీవని కాదన్న వారు ప్యాకేజీ కావాలని ముందుగానే కేంద్రాన్ని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.

జనసేన అధ్యక్షుడు విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. టీడీపీ, బీజేపీ పార్టీలు విఫలమయ్యాయని, ఆ రెండు పార్టీలను బలపరిచినందుకు పవన్ తన తప్పుని ఒప్పుకొని ప్రజలకు ముందు క్షమాపణలు చెప్పాలన్నారు. ప్రస్తుత పరిస్థితులతో సంబంధం లేదనే విధంగా పవన్ వ్యవహారశైలి ప్రజలకు నచ్చదన్నారు. మహిళ రిజర్వేషన్లపై ఢిల్లీలో జరిగిన సదస్సు అనంతరం వామపక్ష నేతలు మీడియాతో మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+