మోడీతో భేటీ: బిజెపిలోకి మైసూరు యువరాజు!
బెంగళూరు: మైసూరు యదువంశ యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ వడయార్ భారతీయ జనతా పార్టీలోకి చేరనున్నట్లు సమాచారం. కర్ణాటక రాష్ట్ర బిజెపి నేతలు కూడా ఈ మేరకు ధృవీకరించినట్లు తెలిసింది.
కాగా, యువరాజు కమలదళంలోకి చేరడానికి ప్రధాని నరేంద్రమోడీ సైతం అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

మైసూరులో ఆదివారం జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన నరేంద్ర మోడీ స్థానిక లలిత్‌మహల్ హోటల్‌లో బస చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయమే రాజమాత ప్రమోదా దేవి తమ దత్త కుమారుడు యదువీర్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సమయంలో యదువీర్ తాను బిజెపిలోకి చేరి దేశానికి సేవ చేయాలని భావిస్తున్నట్లు మోడీతో పేర్కొన్నట్లు తెలిసింది. ఇందుకు నరేంద్ర మోడీ తన సమ్మతిని తెలియజేశారు. ఇదిలా ఉండగా గతంలో కూడా యదువీర్ తాను త్వరలోకి రాజకీయాల్లోకి రానున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు.












Click it and Unblock the Notifications