ఆ వెపన్స్‌భారత్‌పై వాడుతుంది: అమెరికాకి పాక్ మాజీ

న్యూయార్క్: అమెరికా ఆయుధాలు ఇస్తే వాటిని పాకిస్తాన్.. జిహాదీల పైన ప్రయోగించదని, భారత దేశం పైన యుద్ధం చేసేందుకు ఉపయోగిస్తుందని పాకిస్తాన్ మాజీ రాయబారి సంచలన విషయం చెప్పారు. పాక్ మాజీ దౌత్యవేత్త హుస్సేన్ హక్కానీ ఈ విషయాన్ని అమెరికాకు పత్రిక ద్వారా చెప్పారు.

ఆయన అమెరికాలో పాకిస్తాన్ రాయబారిగా గతంలో పని చేశారు. అమెరికా విక్రయిస్తున్న దాదాపు వంద కోట్ల డాలర్ల విలువైన దాడి హెలికాప్టర్లు, క్షిపణిలు, ఇతర ఆయుధాలను ఉగ్రవాదులపై కాకుండా భారత్ పైనే పాక్ ఉపయోగిస్తుందని హితవు పలికారు.

ఆయుధాలను పాకిస్తాన్‌కు విక్రయించాలన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వం నిర్ణయం వల్ల దక్షిణ ఆసియాలో ఘర్షణలకు ఆజ్యం పోసినట్లు అవుతుందని హెచ్చరించారు. ఉగ్రవాదులను ఎదుర్కొనేలా పాకిస్తాన్‌కు సాయం చేయాలన్న లక్ష్యం ఏమాత్రం నెరవేరదన్నారు.

Pakistan to use US weapons in fight against India, not jihadists: Ex Pak Diplomat

ఆయన వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికలో ఓ వ్యాసం రాశారు. జీహాదీలను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ వైఫల్యానికి ఆయుధాలు లేకపోవడం కారణం ఏమాత్రం కాదని అభిప్రాయపడ్డారు. అందుకు చిత్తశుద్ధి లేకపోవడమే అన్నారు.
పాక్ వైఖరి మారకుంటే అమెరికా ఇచ్చిన ఆయుధాలు భారత్‌లతో పోరాడేందుకు, దేశీయ శత్రువులను అణిచివేసేందుకు మాత్రమే ఉపయోగపడతాయన్నారు.

పాక్ తీరు చూస్తే దాడి చేసే హెలికాప్టర్లు, హెల్ ఫైర్ క్షిపణిలు, కమ్యూనికేషన్, శిక్షణ సామాగ్రిని వాయువ్య బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని లౌకిక తీవ్రవాదులపై లేదా కాశ్మీర్ సరిహద్దుల వెంబడి కానీ మోహరించవచ్చునని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+