బిజెపితో బాబు సర్దుబాటు వెనక (పిక్చర్స్)

సంగారెడ్డి: బిజెపితో సీమాంధ్రలో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధపడిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాస్తా వెనక్కి తగ్గారు. ఇరు పార్టీల మధ్య పొత్తు బెడిసికొట్టిన స్థితికి వచ్చింది. ఈ సమయంలో తెర వెనక చాలా వ్యవహారమే నడిచినట్లు తెలుస్తోంది. ఆ వ్యవహారమే చంద్రబాబును వెనక్కి తగ్గేలా చేసిందని అంటున్నారు. ఆర్ఎస్ఎస్ నేత పురోహిత్ ఇందులో కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు.

పలు సీట్లలో బీజేపీ బలహీన అభ్యర్థులను నిలపడం, వారిని మార్చడానికి ఆ పార్టీ తిరస్కరించడంతో విసుగు చెందిన చంద్బాబు తాము పొత్తు నుంచి విరమించుకొంటున్నట్లు సంకేతాలు పంపించారు. అంతర్గత విషయాలపై సాధారణంగా బయట మాట్లాడకుండా నిగ్రహం పాటించే చంద్రబాబు విజయనగరం జిల్లా గజపతినగరంలో జరిగిన బహిరంగ సభలో బిజెపి బలహీన అభ్యర్థులపై తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. బిజెపితో పొత్తు ఉండాలా వద్దా అన్నదానిపై గురువారం ఆ పార్టీ సీమాంధ్రలో ఐవీఆర్ఎస్ ఫోన్ సర్వే కూడా నిర్వహించింది. ఇందులో మెజారిటీ అభిప్రాయం ఒంటరి పోరుకే అనుకూలంగా వచ్చినట్లు సమాచారం.

బిజెపికి ఇచ్చిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ పెట్టాలనుకొంటున్న వారికి నామినేషన్లు వేయడానికి తయారుగా ఉండాలని కూడా చెప్పారు. గురువారం రాత్రి వరకూ కూడా పొత్తును తెంచుకోవడానికి మొగ్గు చూపింది. కానీ, శుక్రవారం ఉదయానికి మనసు మార్చుకొంది. పొత్తులో ఇంత దూరం వచ్చిన తర్వాత తెగతెంపులు సరికాదన్న ఆలోచన మొగ్గ తొడగడంతో చివరకు రాజీ పడ్డారు.

తన వద్దకు చర్చలకు వచ్చిన బీజేపీ నేతలకు చంద్రబాబు సీట్ల వారీగా సమస్యలను వివరించారు. మంచి అభ్యర్థులను అయినా పెట్టాలని, లేకపోతే ఆ సీట్లు తమకు ఇచ్చి వేయాలని గట్టిగా కోరారు. సీట్లు వెనక్కు ఇవ్వడానికి బిజెపి నేతలు ఒప్పుకోలేదు. ఆ పని చేస్తే తమ పార్టీలో తమకు అంతర్గతంగా సమస్యలు వస్తాయని, అభ్యర్థిత్వాలపై మాత్రం పునః పరిశీలన చేస్తామని చెప్పారు.

ఇచ్చాపురం సీటు వివాదంపై దివంగత ఎర్రన్నాయుడు సతీమణి బిజెపి నేత వెంకయ్య నాయుడుకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. దాంతో అక్కడ సీటును వెనక్కు ఇవ్వడానికి బిజెపి నేతలు ఒప్పుకొన్నారు. నర్సాపురం లోక్‌సభ స్థానంలో అభ్యర్థి వ్యవహారం కూడా వారి మధ్య సుదీర్ఘంగా నడిచింది.

రాజకీయ నిర్ణయాల్లో సంఘ్ పరివార్ ప్రమేయంపై తెలుగుదేశం నేతలు ఆందోళన వ్యక్తం చేసినా శుక్రవారం చంద్రబాబుతో జరిగిన చర్చల్లో ఆర్ఎస్ఎస్ నేత కూడా పాల్గొనడం విశేషం. ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు రాం మాధవ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. కానీ, ఆయన మీడియా ముందుకు రాలేదు. చర్చలు ఫలవంతంగా జరిగాయని, పెద్ద సమస్యలేవీ లేవని తర్వాత ఆయన ఒక మీడియా ప్రతినిధితో వ్యాఖ్యానించారు.

రామ్మోహన్ రావుతో జవదేకర్ గుసగుస

రామ్మోహన్ రావుతో జవదేకర్ గుసగుస

బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు బెడిసికొట్టిందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో బిజెపి నేత ప్రకాష్ జవదేకర్ హైదరాబాద్ చేరుకున్నారు.

టిడిపి నేతలతో జవదేకర్ భేటీ..

టిడిపి నేతలతో జవదేకర్ భేటీ..

చంద్రబాబుతో చర్చలు ముగిసిన తర్వాత ప్రకాష్ జవదేకర్ తెలుగుదేశం పార్టీ నాయకులతో చర్చలు జరిపారు.

ఆర్ఎస్ఎస్ నేతలు కూడా..

ఆర్ఎస్ఎస్ నేతలు కూడా..

తెలుగుదేశం పార్టీ నాయకులతో జరిగిన చర్చల్లో బిజెపి నేత ప్రకాష్ జవదేకర్‌తో పాటు ఆర్ఎస్ఎస్ నేతలు కూడా పాల్గొన్నారు.

పొత్తుపై సమస్యలు లేవు..

పొత్తుపై సమస్యలు లేవు..

తెలుగుదేశం పార్టీ పొత్తును తెంచుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా పొత్తు ఉంటుందని బిజెపి నేత ప్రకాష్ జవదేకర్ గట్టిగా చెబుతూ వచ్చారు.

పెద్గగా మార్పేమీ లేదు..

పెద్గగా మార్పేమీ లేదు..

నర్సాపురం సీటు రఘురామకృష్ణంరాజుకు కాకుండా రంగరాజుకు ఇచ్చిన విషయంపై కూడా బిజెపి వెనక్కి తగ్గలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+