Kolli Venkata Kishore       Aug 25, 2023

మజ్జిగను అధికంగా తీసుకుంటే కలిగే దుష్ప్రభావాలు తెలుసా?

మజ్జిగ ఎముకలను బలోపేతంలో చేయడంలో సహాయపడుతుంది.

నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుంది.

కానీ మజ్జిగను అధికంగా తీసుకుంటే దుష్ప్రభావాలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిక.

మజ్జిగలో లాక్టోస్ ఉంటుంది. అసహనంతో ఉన్నవారు తీసుకుంటే ఉబ్బరం, గ్యాస్, విరేచానాలు, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం.

కొంతమందికి మజ్జిగ అలెర్జీకి దారితీస్తుంది.

చర్మ దద్దుర్లు, శ్వాసకోశ సమస్యలు వంటివి వచ్చే అవకాశం ఉంది.

మజ్జిగ ఎక్కువ తీసుకోవడం వల్ల బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.

మార్కెట్లో లభించే మజ్జిగలో అదనపు ఉప్పు కలిగి ఉంటాయి.

మజ్జిగలో అధిక ఉప్పు చేర్చడం వల్ల రక్తపోటు, గుండె సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం.

మజ్జిగలో కలిపే సుగంధ ద్రవ్యాలు, మూలికలు కొన్ని సార్లు జీర్ణాశ్రయంపై ప్రభావం చూపుతాయి.

మజ్జిగను మితంగా తీసుకున్నప్పుడే ఆరోగ్యానికి మంచిది.

మజ్జిగను అధికంగా తీసుకోవడం వల్ల అనాలోచిత పరిణామాలకు దారితీస్తుంది.