Kolli Venkata Kishore       Jun 18, 2023

జామ పండు తింటే సంతాన సామర్థ్యం పెరుగుతుందా..?

జామ పండు రుచిలోనే కాదు శరీరానికి పోషకాలను అందించడంలోనూ మేటి.

జామ పండులో పీచు ఎక్కువ. గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ.

జామలో విటమిన్ సి, లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం.

జామ పండును తరచూ తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

శరీరంలో క్యాన్సర్ కణాలను వృద్ధి కాకుండా అడ్డుకుంటుంది.

బ్రెస్ట్ క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయి.

శరీరంలో చక్కెర నిల్వలు పడిపోకుండా సమతుల్యంగా ఉంచుతాయి.

రక్తపోటును అదుపులో ఉంచడంలో సాయపడుంది.

చెడు కొవ్వును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

పోషకాలలో మేటి అయిన జామ పండు సంతాన సామర్థ్యాన్ని పెంచుతుంది.

జామలో ఉండే ఫోలేట్ సంతాన సామర్థ్యాన్ని పెంచుతుంది.

జామలో ఉండే ఫోలిక్ యాసిడ్ గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.

జామలో ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియను సాఫీగా సాగేలా చేస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది.