Kolli Venkata Kishore Oct 21, 2024
రాత్రిపూట జుట్టుకు ఆయిల్ రాస్తున్నారా? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి.
కొంతమంది జుట్టుకు రాత్రిపూట నూనె రాసుకుని మరుసటి రోజు ఉదయం తల స్నానం చేస్తుంటారు .
ఎంత ఎక్కువ సేపు నూనెతో ఉంటే జుట్టుకు అన్ని పోషకాలు అందుతాయనుకుంటారు.
కానీ ఎక్కువ సేపు జుట్టుకు నూనె ఉంచడం వల్ల మురికి పేరుకుపోతుంది.
జుట్టుకు నూనె పెట్టిన రెండు గంటల తర్వాత షాంపుతో తలస్నానం చేస్తే మంచిది.
చుండ్రు ఎక్కువగా ఉన్నప్పుడు జుట్టుకు నూనె పెట్టొద్దు. ఇలా చేస్తే సమస్య రెట్టింపవుతుంది.
జుట్టు రాలుతుందంటే ఎక్కువ మొత్తంలో నూనె రాస్తుంటారు.
కానీ జుట్టు రాలడానికి కారణం హార్మోన్ల హెచ్చుతగ్గులు, సరైన పోషకాలు అందకపోవడం
జుట్టు పొడిగా మారినప్పుడు మాత్రమే నూనె రాస్తే మంచిది.
హాయిగా ఉంది కదా అని నూనె రాసుకున్నప్పుడల్లా గంట కొద్ది మసాజ్ చేయించుంటారు.
మసాజ్ ఎక్కువ సేపు చేయడం వల్ల కుదుళ్లు బలహీనపడతాయి.
ఎక్కువసేపు కురులను తాకడం వల్ల రాలిపోయే అవకాశమూ ఉంది.
సబ్జా గింజలను అతిగా తింటే సమస్యలు తప్పవా..?
Next Story