Kolli Venkata Kishore       Oct 26, 2024

గుమ్మడి గింజలు: ఆరోగ్యానికి నిధి!..  తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

గుమ్మడి గింజలు చిన్నవి అయినా, వాటిలో దాగి ఉన్న ఆరోగ్య గుణాలు అద్భుతం.

గుమ్మడి గింజల్లో ప్రోటీన్, మెగ్నీషియం, జింక్, ఐరన్, విటమిన్లు పుష్కలం.

గుమ్మడి గింజలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

గుమ్మడి గింజలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి

గుమ్మడి గింజల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం మెలటోనిన్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఇది మంచి నిద్రను ప్రేరేపిస్తుంది.

పురుషులలో ప్రోస్టేట్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయడుతాయి.

మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి.

గుమ్మడి గింజల్లో కాల్షియం మరియు విటమిన్ కె అధికంగా ఉండటం వల్ల ఎముకలను బలపరుస్తుంది.

చర్మం మృదువుగా మరియు మెరుస్తూ ఉండేలా చేస్తుంది.