Kolli Venkata Kishore       Oct 18, 2024

రేగి పండ్లు తింటే కలిగే అద్భుత ఆరోగ్యప్రయోజనాలు ఇవే!

రేగి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ ఎ, సి, ఖనిజ పోషకాలు పుష్కలం.

కండరాలు, నాడీ వ్యస్థ, చర్మానికి కావాల్సిన అనేక పోషకాలు అధికం.

రేగి పండ్లలో ఉండే పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, ఐరన్, జింక్ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి.

ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయులను క్రమబద్ధీకరిస్తూ రక్తహీనతను తగ్గిస్తుంది.

రేగి పండ్లలో ఉండే విటమిన్ సి జీవం కోల్పోయిన మేనిచాయను మెరుగుపరిచి, మెటిమలు లేని అందమైన చర్మాన్ని పెంపొందిస్తుంది.

ఎండబెట్టిన రేగుపళ్లలో ఉండే క్యాల్షియం, ఫాస్పరస్ ఎముకల దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడుతాయి.

రేగి పండ్లలో ఉండే పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

మలబద్ధకం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది.

రేగిపండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఫైటో కెమికల్స్, పాలీశాకరైడ్స్, ప్లేవనాయిడ్స్, సపోనిన్స్ వంటివి నిద్రకు తోడ్పడతాయి.