Kolli Venkata Kishore       Oct 14, 2024

ఉదయాన్నే వాము వాటర్ తాగితే శరీరంలో కలిగే మార్పులు ఇవే!

వాము ఆహారానికి రుచి, వాసనను ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

వాము కడుపు నొప్పి తగ్గించడానికి హోం రెమెడీగా ఉపయోగిస్తారు.

ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో వాము నీళ్లు తాగడం వల్ల జీర్ణ సమస్యలు పూర్తిగా తగ్గుతాయి

జీర్ణక్రియకు సంబంధించిన ఇన్ఫెక్షన్లను నివారించడంలో వాము నీళ్లు ఔషధంలా పనిచేస్తాయి.

వీరోచనాలతో బాధపడుతున్న వారు నీళ్లు తాగితే ఉపశమనం లబిస్తుంది.

కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వాము వాటర్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

వాము వాటర్ తాగితే గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్‌ స్థాయి పెరుగుతుంది.

వామును నీళ్లలో వేసి మరిగించి రోజూ పరగడుపున తాగితే గుండె జబ్బులు దరి చేరవు.

జలుబుతో బాధపడేవారు వామును ఓ క్లాత్‌తో కట్టి వాసన పీలిస్తే ఉపశమనం లభిస్తుంది

శరీరంలో కొవ్వును కరిగించడానికి వాము వాటర్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.