Kolli Venkata Kishore       Oct 22, 2024

చర్మసౌందర్యాన్ని పెంచే డ్రింక్స్ ఇవే.. మీరూ ట్రై చేయండి!

చలికాలంలో చర్మం పగటడం, పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి.

కొన్ని రకాల డ్రింక్స్ తాగడం వల్ల స్కిన్ మెరుస్తూ ఉంటుంది.

ఉదయం లేవగానే గ్లాసుడు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చర్మానికి మెరుసు వస్తుంది.

అల్లం, ధనియాల కషాయం తాగితే దద్దుర్లు రావు. చర్మం నిగారిస్తుంది.

తరచూ కీరదోస జ్యూస్ తాగడం చర్మానికి మెరుపు వస్తుంది.

పుదీనా, శొంఠిని నీళ్లలో మరిగించి చల్లారాక తాగితే ఉత్తేజం తోపాటు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

గ్రీన్ టీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం పొడిబారకుండా ఉంటుంది.

అలోవెరాలో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తుంది.

కొబ్బరినీళ్లలో పోషకాలు, ఖనిజాలు చర్మం కాంతితో మెరుస్తుంది.

ప్రతి రోజూ తగిన మోతాదులో నీళ్లు తాగితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.