వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహానాడులో కవితకు అవమానం: మనస్తాపంతో మధ్యలోనే నిష్క్రమణ!

పార్టీ ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు తనను వేదికపై కూర్చోబెట్టి.. అధికారంలోకి రాగానే తనను విస్మరించారని కవిత బాధపడినట్లు సమాచారం.

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: టీడీపీ మహానాడు నుంచి సినీ నటి, ఆ పార్టీ నేత కవిత మధ్యలోనే వెళ్లిపోయారు. తనను వేదిక మీదకు ఆహ్వానించలేదన్న కారణంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. టీడీపీ వ్యవహారాలన్ని తనకు ప్రతికూలంగా మారుతున్నాయని ఆమె ఆవేదన చెందినట్లు తెలుస్తోంది.

పార్టీ ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు తనను వేదికపై కూర్చోబెట్టి.. అధికారంలోకి రాగానే తనను విస్మరించారని కవిత బాధపడినట్లు సమాచారం. మహానాడులో టీడీపీ తనను అవమానించిందని అందుకే మధ్యలోనే మహానాడు ప్రాంగణం నుంచి వెళ్లిపోయినట్లు ఆమె పేర్కొనట్లు తెలుస్తోంది.

actress kavita felt insult in mahanadu

ఇదిలా ఉంటే, మహానాడు ప్రాంగణంలో టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఏమాత్రం ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. ఎండను దృష్టిలో పెట్టుకుని 40భారీ కూలర్లతో పాటు పెద్ద పెద్ద ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో 15 భారీ ఎల్ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. విద్యుత్ అంతరాయం తలెత్తకుండా ఉండటానికి 21జనరేటర్లు ఉపయోగిస్తున్నారు.
కార్యకర్తల సౌకర్యం కోసం ప్రాంగణం చుట్టూ 200టాయిలెట్లను ఏర్పాటు చేశారు. కూర్చున్న దగ్గరికే వాటర్ బాటిల్స్, వాటర్ పాకెట్స్ అందేలా ఏర్పాట్లు చేశారు.

English summary
Actress Kavita was felt insulted in TDP Mahanadu at Vizag. She returned from Mahanadu just after few minutes spending there
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X