వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హొండురాస్ వరల్డ్ బ్యూటీ, సోదరి మృతి: బాయ్ ఫ్రెండే..

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మిస్ హోండురాస్ వరల్డ్ 2014 మరియా జోస్ అల్వరాడో, ఆమె సోదరి సోఫియా ట్రినిడాడ్‌లు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఇద్దరు యువతుల మృతదేహాలను గుర్తించారు. అవి మరియా, సోఫియాలదిగా భావిస్తున్నారు. వీరిద్దరి అదృశ్యమైన వారం రోజుల తర్వాత విగత జీవులుగా కనిపించారు. అదృశ్యమైన ప్రాంతంలోనే వారి మృతదేహాలు కనిపించాయి.

సోదరి బాయ్‌ఫ్రెండ్ చేతిలో మృతి చెందినట్లుగా అనుమానిస్తున్నారు. మరియా సోదరి సోఫియాతో మరొకరితో డాన్సు చేయటాన్ని చూసి సహించలేకపోయిన ఆమె బాయ్‌ఫ్రెండ్ ప్లుటార్కో రూయిజ్ తొలుత సోఫియాను, ఆ తరువాత మరియాను కాల్చి చంపాడు. ఆ తరువాత వారి మృత దేహాలను సమీపంలో అగువాల్ నదీ తీరంలో పూడ్చిపెట్టాడు. పోలీసులు మంగళవారం రూయిజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.అతని వద్ద నుంచి కోల్ట్-45 పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు.

కాగా, మిస్ హొండురాస్ వరల్డ్ 2014 మరియా జోస్ అల్వరాడో, ఆమె సోదరి సోఫియా ట్రినిడాడ్‌లు అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని బ్యూటీ పేజేంట్ ఆర్గనైజర్ ఎడ్యూయార్డో జబ్లాష్ తెలిపారు. వారం రోజుల నుండి ఆమె ఆచూకీ లభించడం లేదని ఇటీవల చెప్పారు.

పశ్చిమ హోండురాస్‍‌లోని శాంటా బార్బరాలో మరియా తన సోదరితో కలిసి ఓ పుట్టిన రోజు వేడుకల పార్టీకి హాజరు అయిందని, అప్పటి నుంచి వారిద్దరు ఎక్కడ ఉన్నదీ తెలియడంలేదని జబ్లా తెలిపారు. శనివారం వరకు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. ఈ ఏడాది మిస్ హోండురాస్ వరల్డ్‌గా మరియా జోస్ అల్వరాడో ఎంపికయింది.

 Beauty queen may be dead

వచ్చే నెల లండన్‌లో జరగనున్న మిస్ వరల్డ్ కాంటెస్ట్‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ బ్యూటీ, ఆమె సోదరి గురువారం నుండి కనిపించడం లేదు. హుండురాస్ పోలీసులు వీరిద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ నెలలో జరగనున్న మిస్ వరల్డ్ కాంటెస్టులో పాల్గొననున్న నేపథ్యంలో పోలీసులు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు. మరియా జోస్ అల్వరాడో వయస్సు 19.

ఆమెను చివరిసారిగా పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యేందుకు వాహనం ఎక్కినప్పుడే చూశారు. ఆ తర్వాత నుండి కనిపించడం లేదు. ఇందుకు సంబంధించి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకోని ప్రశ్నించారు. పోలీసులు ప్రశ్నించిన వారిలో ట్రినిడాడ్ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. నలుగురిని అదుపులోకి తీసుకున్నామని, అందులో సోఫియా ట్రినిడాడ్ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడని, వారిని విచారిస్తున్నామని పోలీసులు అప్పుడు చెప్పారు.

English summary
Two bodies authorities believe to belong to Miss Honduras 2014 and her sister have been found buried near the Spa where they disappeared.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X