వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రెస్సింగ్‌పై కెసిఆర్ వార్నింగ్: కలెక్టర్ ఆమ్రపాలిలో మార్పు?

కలెక్టర్ ఆమ్రపాలికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వార్నింగ్ ఇచ్చారని, దీంతో ఆమెలో మార్పు వచ్చిందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కలెక్టర్ ఆమ్రపాలికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వార్నింగ్ ఇచ్చారని, దీంతో ఆమెలో మార్పు వచ్చిందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

వేడుకలకు ఆమ్రపాలి

వేడుకలకు ఆమ్రపాలి

ఆమె మంగళవారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పొడవైన చేతులు, నిండు చీరకట్టుతో హాజరయ్యారు. సాధారణంగా ఆమ్రపాలి ఎక్కువగా వెస్టర్న్ డ్రెస్సింగ్‌లో కనిపిస్తారు.

Recommended Video

KCR lays Foundation Stone of Developmental works in Muduchintalapally
డ్రెస్సింగ్ స్టైల్‌పై కేసీఆర్ అసహనం?

డ్రెస్సింగ్ స్టైల్‌పై కేసీఆర్ అసహనం?

దీనిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మీడియాలో ప్రచారం జరిగింది. ఇటీవల సిఎం కేసీఆర్ అధికారులు, అధికార ప్రతినిధులతో భేటీ అయ్యారని, ఈ సందర్భంగా అధికారులు డ్రెస్సింగ్ స్టైల్‌పై కొంత అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఆదేశాలు

ఆదేశాలు

జీన్ ప్యాంట్లు, టీ షర్ట్‌లు వేసుకోవడం వల్ల అధికారులు అంటే గౌరవం పోతోందని కెసిఆర్ చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. మంత్రులు, అధికారులు, అధికార ప్రతినిధులు అందరూ సాధ్యమైనంత వరకు చేనేత దుస్తులు ధరించాలని చెప్పారని అంటున్నారు.

ఆమ్రపాలికే ఆ హెచ్చరిక అని

ఆమ్రపాలికే ఆ హెచ్చరిక అని

అయితే, కేసీఆర్ చేసిన ఆ వ్యాఖ్యలు కలెక్టర్ ఆమ్రపాలిని ఉద్దేశించినవేనని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమె ఆధునిక పోకడలు డ్రెస్సింగ్ విధానాన్ని ఉద్దేశించే కేసీఆర్ అలా చెప్పారని అంతా అనుకున్నారని తెలుస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె చీరకట్టుతో రావడం ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు.

English summary
KCR warning to Collector Amrapali?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X