రైతు బిడ్డ: ఒడికట్టి విత్తనమేసిన ఏపీ మంత్రి పరిటాల సునీత
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రిగా, తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతగా ఉన్న పరిటాల సునీత పంటపొలాల్లో విత్తనాలు చల్లారు. ఆమె తన సొంత జిల్లా అనంతపురంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతుంటారు. ఈ క్రమంలో పలుమార్లు పంట పొలాల్లో పని చేస్తూ కనిపించారు.
తాజాగా, గురువారం నాడు కూడా ఆమె పంట పొలాల్లో విత్తనాలు జల్లుతూ కనిపించారు. జిల్లాలోని రామినేనిపల్లిలో పర్యటించన ఆమె అక్కడి రైతులతో కలిసి పొలంలోకి అడుగు పెట్టారు.

అక్కడ వేరుశనగ విత్తనాలు వేస్తుండటాన్ని చూసిన సునీత వారికి జత కలిశారు. చీరను ఒడి కట్టి, వేరుశనగ గింజలు అందులో వేసుకొని విత్తనాలు చల్లారు. ఎద్దులతో రైతు దున్నుతుండగా.. వెనుకనే సాగులో విత్తనాలు జల్లుతూ వెళ్లారు.
కాగా, మన రాజకీయా నాయకులు చాలామంది సమయం దొరికినప్పుడు అప్పుడప్పుడు తమతమ వ్యవసాయ క్షేత్రాల్లో కనిపించడం సాధారణమే. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిత్యం మెదక్ జిల్లాలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్తుంటారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications