కోవిడ్ సమయంలో నగదు లభ్యత తగ్గిపోయిన నేపథ్యంలో యూపీఐ (UPI)ద్వారా నగదు లావాదేవీల్ని కేంద్రం భారీ ఎత్తున ప్రోత్సహించింది. ఇప్పుడు ప్రతీ ఏటా దేశంలో యూపీఐ లావాదేవీల సంఖ్య కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రానికి కూడా ఆశ పుట్టింది. 2 వేలకు మించిన యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించడం ద్వారా కొంత ఆదాయం సంపాదించుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. దీంతో కేంద్రం నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి.
ఐటీ రిటర్న్ లో భార్యా భర్తల ఆఫర్..! నిర్మలమ్మకు సాయిరెడ్డి డిమాండ్..!
ఈ నేపథ్యంలో స్వతహాగా ఆడిటర్, ఛార్జర్ట్ అకౌంటెంట్ కూడా అయిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించాలన్న కేంద్రం నిర్ణయంపై స్పందించారు. ఈ మేరకు కేంద్రం నిర్ణయం వల్ల కలిగే ప్రతికూల ఫలితాలను వివరిస్తూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను ఉద్దేశించి సాయిరెడ్డి ఇవాళ ఓ ట్వీట్ చేసారు. ఇందులో ఆయన యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. లేకపోతే ఇన్నాళ్లు డిజిటల్ లావాదేవీలు పెంచేందుకు కేంద్రం పడిన కష్టం అంతా వృథా అవుతుందని హెచ్చరించారు.
యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి కోరారు. యూపీఐపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించడం వల్ల డిజిటల్ చెల్లింపులలో సాధించిన ఏళ్ల తరబడి పురోగతి వృధా అవుతుందని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు. యూపీఐ లావాదేవీలపై చిన్న పాటి రుసుము కూడా చాలా మంది వినియోగదారులను, వ్యాపారులను తిరిగి నగదు వైపు మళ్లిస్తుందని ఆయన హెచ్చరించారు. అందుకే భారతదేశ డిజిటల్ చెల్లింపుల విప్లవాన్ని మనం కాపాడుకుందామని ఆర్దికమంత్రి నిర్మలా సీతారామన్ కు ఆయన సూచించారు. మరి సాయిరెడ్డి సూచనలపై ఆర్థికమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.2.5 లక్షలకు PPF లిమిట్ ?- ఆర్థికమంత్రికి సాయిరెడ్డి కీలక ప్రతిపాదన..!