ఢిల్లీ ఎపిసోడ్ రిపీట్ కాకూడదంటే ?- తేల్చేసిన విజయసాయిరెడ్డి..!
నీట్ సహా జాతీయ పోటీ పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ విద్యార్దులు రోడ్డెక్కారు. ఢిల్లీకి చేరుకుని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనలు చేపట్టారు. పార్లమెంట్ మార్చ్ కు బయలుదేరి పోలీసుల దాడుల్లో గాయపడ్డారు. చివరికి తాము అనుకున్న విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించేశారు. దీంతో భారత్ లో విద్యార్దుల ఆందోళన, కేంద్రం తీరుతో పాటు ఎన్నో అంశాలపై ఇప్పుడు అంతర్జాతీయ స్ధాయిలో చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఈ నిరసనలకు కారణమైన పేపర్ లీక్ తో పాటు పరీక్షల వ్యవస్ధలో లోటుపాట్లు, కేంద్రం వ్యవహారశైలి ఇలా పలు అంశాలపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) ఇవాళ ట్వీట్ చేశారు. అయితే ఎక్కడా కేంద్రం కానీ విద్యార్ధుల పేర్లు కానీ ప్రస్తావించకుండానే పరోక్షంగా ఆయా అంశాలపై సాయిరెడ్డి తనదైన శైలిలో చురకలు అంటించారు. ముఖ్యంగా ఈ ఎపిసోడ్ లో విద్యార్దులతో పాటు కేంద్రానికీ తప్పే అనే విధంగా సాయిరెడ్డి ట్వీట్ ఉంది.

You will not see protests over paper leaks in developed countries because they don’t place overwhelming importance on a handful of competitive examinations. In India, for crores of middle-class youth, these exams are seen as the primary path to economic mobility. While…
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 26, 2026
అభివృద్ధి చెందిన దేశాలలో ప్రశ్నపత్రాల లీకేజీలపై నిరసనలు కనిపించవని, ఎందుకంటే వారు కొన్ని పోటీ పరీక్షలకు అధిక ప్రాధాన్యత ఇవ్వరని సాయిరెడ్డి తెలిపారు. భారతదేశంలో, కోట్లాది మంది మధ్యతరగతి యువతకు, ఈ పరీక్షలే ఆర్థికంగా పైకి రావడానికి ప్రధాన మార్గంగా కనిపిస్తాయన్నారు. మన పరీక్షా వ్యవస్థ సమగ్రతను బలోపేతం చేయడం ఎంత అవసరమో, అంతే స్థాయిలో మనం మరిన్ని ఉన్నత-నాణ్యత గల వైట్-కాలర్ ఉద్యోగాలను, ప్రత్యామ్నాయ వృత్తి మార్గాలను కూడా సృష్టించాలని కేంద్రానికి తెలిపారు. తద్వారా ఒక పోటీ పరీక్షలో విఫలమవడం అనేది ఒక యువ వ్యక్తి భవిష్యత్తుకు ముగింపుగా అనుకోకూడదని సాయిరెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications