పార్లమెంట్ మార్చ్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్- షాకింగ్ దృశ్యాలు, బ్యారికేడ్ల బద్దలు..!

ఈ నెల 20న ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ కు కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు భారీ ఎత్తున తరలివచ్చిన విద్యార్థులపై పోలీసులు భారీగా బలప్రయోగం చేసి గాయపరిచారన్న విమర్శలు వచ్చాయి. దీనిపై సుప్రీంకోర్టు కూడా ఇవాళ విద్యార్ధుల పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఈ నెల 20న పార్లమెంట్ మార్చ్ సందర్భంగా ఏం జరిగిందన్న దానిపై సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను విడుదల చేశారు.

ఈ సీసీటీవీ ఫుటేజ్ (CCTV) లో విద్యార్ధులు భారీ ఎత్తున మార్చ్ గా వస్తుండగా.. పోలీసులు భారీగా బ్యారికేడ్లు పెట్టి వారిని అడ్డగించిన దృశ్యాలు ఉన్నాయి. అలాగే పోలీసులతో వాగ్వాదం తర్వాత విద్యార్ధులు బ్యారికేడ్లను బద్దలు కొట్టి ముందుకు వెళ్తున్న దృశ్యాలు, అలాగే పోలీసులపై భారీ ఎత్తున రాళ్లు రువ్వుతున్న వీడియోలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే రోడ్ల పక్కన నిలిపి ఉంచిన పోలీసు కార్లను విద్యార్ధులు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు కూడా ఇందులో ఉన్నాయి.

Delhi Police Release CCTV Footage Showing Stone Pelting Barricade Breach During Students Parliament March

ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ పుటేజ్ లలో ప్రధానంగా విద్యార్ధులు తమపై దాడి చేసిన దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. విద్యార్థులపై వారు దాడులు చేసిన దృశ్యాలు లేవు. అంటే ఉద్దేశపూర్వకంగానే ఢిల్లీ పోలీసులు ఈ వీడియాలను విడుదల చేయడం ద్వారా తమ తప్పేమీ లేదని చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. కానీ విద్యార్ధులు మాత్రం పోలీసులు తమపై దాడి చేసి గాయపరిచిన దృశ్యాలను ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ ఎత్తున షేర్ చేశారు. వాటిపైనే ఢిల్లీ పోలీసులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాగే ఢిల్లీ పోలీసులు తాజాగా ఇన్ స్టాల్ చేసిన ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలపైనా విమర్శలు వస్తున్న నేపథ్యంలో విద్యార్ధుల్ని ఇరుకునపెట్టేందుకు ఈ ఫుటేజ్ విడుదల చేసినట్లు అర్దమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+