Viral Video: ‘జైలర్ 2’ పాటకు డేవిడ్ భాయ్ డ్యాన్స్.. స్టెప్పులు మామూలుగా లేవుగా..!
Viral Video: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, భారతీయ సినిమాలపై ఎంతగానో అభిమానం చూపే డేవిడ్ వార్నర్ మరోసారి సోషల్ మీడియాలో నెటిజన్లను అలరించారు. తాజాగా ఆయన ఏఐ అవతార్‌కి సంబంధించిన ఓ డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ రాబోయే సినిమా 'జైలర్ 2'లోని "ఆలా బొలేలో" అనే పాటకు వార్నర్ ఏఐ అవతార్ ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేయడం ఈ వీడియోలో చూడవచ్చు.
ఈ ఫన్నీ డ్యాన్స్ వీడియోను స్వయంగా డేవిడ్ వార్నర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ సరదాగా స్పందించారు. "అసలు ఈ వీడియోను ఎవరు చేశారు? బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతున్న పాట ఏంటో లేదా నేను చేస్తున్న డ్యాన్స్ ఏంటో నాకు అసలు తెలీదు. కానీ నా బాలీవుడ్ డేవ్ కి మాత్రం డ్యాన్స్ స్టెప్స్ వచ్చు అని అర్థమవుతోంది. నా ఈ డ్యాన్స్ టెక్నిక్ కు 10కి ఎన్ని మార్కులు ఇస్తారా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను నాకు పంపిన వ్యక్తి ఎవరో ఉంటే కింద కామెంట్స్‌లో చెప్పండి" అంటూ డేవిడ్ వార్నర్ క్యాప్షన్ రాసుకొచ్చారు.

భారతీయ సినిమాలు, పాటల పట్ల డేవిడ్ వార్నర్ కు ఉన్న ఇంట్రెస్ట్ కొత్తదేమీ కాదు. ఐపీఎల్ రోజుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ప్రాతినిధ్య వహించినప్పటి నుంచి ఆయన తెలుగు, హిందీ పాటలకు డ్యాన్సులు చేస్తూ రీల్స్ పోస్ట్ చేసేవారు. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన 'పుష్ప: ది రైజ్' సినిమాలోని శ్రీవల్లి పాట హుక్ స్టెప్స్, 'తగ్గేదే లే"(ఝుకేగా నహీ) మేనరిజాన్ని రీక్రియేట్ చేసి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇటీవల నితిన్ నటించిన 'రాబిన్‌హుడ్' సినిమాలోనూ వార్నర్ మెరిసిన విషయం తెలిసిందే.
ఇక ఈ ఏఐ వీడియోతో మరోసారి వార్నర్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కాగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్(కళానిధి మారన్) నిర్మాణంలో రజనీకాంత్ హీరోగా రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం 'జైలర్ 2'. 2023లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'జైలర్' సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా 2026 అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.













Click it and Unblock the Notifications
