పర్యాటకంగా తెలంగాణా బ్రాండ్ ప్రపంచానికి తెలిసేలా.. ఆదాయం వచ్చేలా బిగ్ ప్లాన్!

తెలంగాణలో పర్యాటక రంగాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించేలా తీర్చి దిద్దటం కోసం పర్యాటక శాఖ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. తెలంగాణలో ఉన్న పర్యాటాక ప్రాంతాలను, చారిత్రక కట్టడాలను, ఎకో టూరిజం ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి, రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.

‎పర్యాటక అభివృద్ధి అంటే కేవలం పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడం మాత్రమే కాదని, తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయడం కూడా అందులో భాగమేనని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పెట్టుబడులు, ఉపాధి, ఆదాయ అవకాశాలను పెంచుతూ రాష్ట్ర పర్యాటక రంగాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

International Tourism Destination Telangana big plan with public-private investments tourism revenue

‎గురువారం హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో పర్యాటక, సాంస్కృతిక శాఖల ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ‎ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పర్యాటక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యాన్ని విస్తృతం చేయాలని, పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో కొత్త ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని సూచించారు. పర్యాటక శాఖకు చెందిన ఆస్తులను సమర్థంగా వినియోగించుకోవాలన్నారు.

భవనాలు ఉన్న ఆస్తులు, ఖాళీ స్థలాలు, PPP విధానంలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆదాయాన్ని సమకూర్చే విధంగా ఆస్తులను అభివృద్ధి చేయడంతో పాటు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే చర్యలు చేపట్టాలని సూచించారు. ‎తెలంగాణలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హిల్ టూరిజం తదితర విభాగాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని అన్నారు.

రాష్ట్రంలోని చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలను ప్రపంచ పర్యాటక పటంలో నిలిపేలా విస్తృత స్థాయిలో బ్రాండింగ్, మార్కెటింగ్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌కు వచ్చే దేశీయ, విదేశీ పర్యాటకులను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఆకర్షించేలా ప్రత్యేక పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని చెప్పారు. పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రైవేట్ రంగాన్ని భాగస్వామ్యం చేయాలని సూచించారు.

సింగరేణి ప్రాంత యువతకు శుభవార్త.. మరో కొత్తగని త్వరలో ప్రారంభం!
సింగరేణి ప్రాంత యువతకు శుభవార్త.. మరో కొత్తగని త్వరలో ప్రారంభం!

పర్యాటక ప్రాజెక్టులకు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. లీజు విధానాలు, ప్రాజెక్టుల ఆర్థిక సాధ్యత, పెట్టుబడిదారుల ఆసక్తి వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి అవసరమైన మార్పులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. కొత్త పర్యాటక ప్రాజెక్టుల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+