హైదరాబాద్ గణేశ నిమజ్జన శోభాయాత్ర.. 20వేల పోలీసులు, 10వేల సీసీకెమెరాలతో బాహుబలి సైన్యం సిద్ధం!

హైదరాబాద్ లో వైభవంగా సాగిన గణపతి నవరాత్రోత్సవాల ముగింపు వేడుకలకు సర్వం సన్నద్ధమయ్యింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు విభాగం, భాగ్యనగర గణేష ఉత్సవ సమితి సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రేపు జరిగే మహానిమజ్జన శోభాయాత్రతో ఉత్సవాలు పూర్తవుతాయి. బాలాపూర్ గణేష్ నుంచి జరిగే తుది శోభాయాత్రకోసం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

ఊరేగింపు సాగే మార్గాల్లో 10 వేల సీసీ కెమెరాలు, 24 డ్రోన్లు, దాదాపు 100 హైరైజ్ కెమెరాలను నిఘా కోసం ఉపయోగిస్తున్నారు. వీటిని బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించి నిమజ్జన వేడుకలను పర్యవేక్షించనున్నారు. శోభాయాత్ర, వినాయక సాగర్ పొడవునా 20 వేల మంది సిబ్బందికి తోడు, 4 ఆర్ఏఎఫ్, 2 సీఆర్‌పీఎఫ్ కంపెనీలను, 53 బీడీ టీంలను మోహరించారు.

Hyderabad Ganesh immersion Shobha Yatra Baahubali force ready comprising 20k police and 10k CCTV cameras

ప్రధాన జలాశయాల వద్ద గజ ఈతగాళ్లను, రెస్క్యూ బోట్లను సిద్ధంగా ఉంచారు. ఇప్పటివరకు 32వేల 878 విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం నగరవ్యాప్తంగా దాదాపు 77,000 నుంచి లక్ష వరకు గణపతి విగ్రహాలు నిమజ్జనం కావడానికి సిద్ధంగా ఉన్నాయి.

GHMC అధికారిక అంచనా ప్రకారం 5 అడుగుల లోపు విగ్రహాలు 52,158, అంతకంటే ఎత్తైనవి 25,529 ఉన్నాయి. మొత్తం 77,687 విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. మూడు కార్పొరేషన్ల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లక్ష విగ్రహాల వరకు నిమజ్జనం జరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రధాన నిమజ్జన దినం సెప్టెంబర్ 25 శుక్రవారం కావటంతో రేపటి శోభాయత్రకు సర్వం సిద్ధం చేశారు. నిమజ్జనం సాఫీగా జరగాలని GHMC 280 క్రేన్లు 110 స్టాటిక్, 170 మొబైల్ క్రేన్ లను ఏర్పాటు చేశారు. 136 గణేష్ యాక్షన్ టీమ్స్, 6,000 మంది స్వీపర్లు, 770 మంది సానిటేషన్ వర్కర్లు రంగంలో ఉన్నారు. 40కి పైగా సరస్సులు, బేబీ పాండ్స్, కృత్రిమ ట్యాంకుల్లో నిమజ్జనం జరుగుతుంది.

పర్యాటకంగా తెలంగాణా బ్రాండ్ ప్రపంచానికి తెలిసేలా.. ఆదాయం వచ్చేలా బిగ్ ప్లాన్!
పర్యాటకంగా తెలంగాణా బ్రాండ్ ప్రపంచానికి తెలిసేలా.. ఆదాయం వచ్చేలా బిగ్ ప్లాన్!

ట్యాంక్ బండ్‌పై నిమజ్జనానికి అనుమతి లేదు. క్లే, ఎకో-ఫ్రెండ్లీ విగ్రహాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని, నిర్ణీత ప్రాంతాల్లోనే నిమజ్జనం చేయాలని అధికారులు కోరుతున్నారు. నిమజ్జనం ప్రశాంతంగా, క్రమబద్ధంగా జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డీజేలు, బాణసంచాపై నిషేధం ఉందని, అసభ్య ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనర్ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+