హైదరాబాద్ లో M-FAST దాడులు.. 730 టన్నుల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం
హైదరాబాద్ మహా నగరం అనగానే చాలా మందికి చార్మినార్, గోల్కొండ లాంటి చారిత్రక కట్టడాలతోపాటు బిర్యానీ, హలీమ్, పాయా, ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్స్ లాంటి ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్ కూడా గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్ కల్తీబాద్ గా మారుతోంది. ఏం తినాలన్నా.. ఏం కొనాలన్నా.. ఎక్కడ చూసినా కల్తీమయంగా మారిపోయింది. దాంతో ప్రజలు బయట తినాలన్నా, ఏదైనా కొనాలన్నా బెంబేలెత్తిపోతున్నారు. ఇలా రాజధాని నగరంలో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న కల్తీ తయారీదారులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నా కల్తీరాయుళ్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఈ కల్తీ పదార్థాలు ప్రజల శరీరాల్లోకి చేరి కొంతకాలం తర్వాత దీర్ఘకాలిక వ్యాధుల రూపంలో వారిని ఆస్పత్రి పాలు చేస్తున్నాయి.
ఇక తాజాగా మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న స్థావరాలపై మల్కాజ్గిరి ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (M-FAST), SOT ఎల్బీ నగర్ టీమ్, హయత్ నగర్ పోలీసులు సంయుక్తంగా ఒక రహస్య ఆపరేషన్ నిర్వహించారు. ఈ మేరకు హైదరాబాద్ శివార్లలోని హయత్ నగర్ లో భారీ స్థాయిలో జరుగుతున్న కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ గుట్టును రట్టు చేశారు. ఈ తనిఖీల్లో దాదాపు 730 కిలోల కల్తీ అల్లం- వెల్లుల్లి పేస్ట్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హయత్ నగర్ పరిధిలోని ఒక అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ యూనిట్ పై అధికారులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో అధికారులు చూసిన దృశ్యాలు షాక్ కు గురిచేశాయి. అక్కడ అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో ఈ పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, లాభాల కోసం నాణ్యత లేని పదార్థాలను వాడుతున్నారు. మల్కాజిగిరి ఫుడ్ అడల్ట్రేషన్ సర్వే లైన్స్ Team, SOT.. LB నగర్ టీమ్ అలాగే హయత్ నగర్ పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 730 కిలోల కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాక ఈ పేస్ట్ కు రంగు, రుచి తీసుకురావడానికి వాడుతున్న గుర్తు తెలియని ఒక రసాయన ద్రవణాన్ని, అలాగే ఫుడ్ కలర్స్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఈ నకిలీ వ్యాపారం నడుపుతున్న ఒక వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications
