భారత్ లో స్వచ్ఛమైన పెట్రోల్, డీజిల్ స్ధానంలో ఇథనాల్ మిశ్రమాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై ఎన్ని విమర్శలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల వాహనాల ఇంజన్లు పాడైపోతున్నాయని, మైలేజ్ సైతం తగ్గిపోతుందని వాహనదారులు చేస్తున్న ఆరోపణల్ని కేంద్రం లెక్కచేయడం లేదు. ఈ నేపథ్యంలో ఇథనాల్ మిక్సింగ్ కు వ్యతిరేకంగా జాతీయ స్దాయిలో టౌన్ హాల్ చర్చలు నిర్వహిస్తున్న ఆప్ ఆధినేత అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal).. తాజాగా కేంద్రానికి మరో ప్రశ్న సంధించారు.
E20పై రేపటి నుంచి భారీ ఉద్యమం - కేజ్రివాల్, పూనావాలా సహా..!
ఈ ఏడాది ఏప్రిల్ లో కేంద్రం రోడ్లపై తిరిగే వాహననాలతో పాటు గాల్లో ఎగిరే విమానాల ఇంధనంలోనూ ఇథనాల్ ను కలిపేందుకు అనుమతి ఇచ్చింది. దీనిపై పత్రికల్లో వచ్చిన ఓ కథనాన్ని ఎక్స్ లో షేర్ చేసిన కేజ్రివాల్.. ఒక వేళ ఇథనాల్ కలిపిన ఇంధనం కారణంగా గాల్లో విమానం ఆగిపోతే పరిస్దితి ఏంటని కేంద్రాన్ని ప్రశ్నించారు. మీ విమానం ఇంజన్ గాలిలోనే ఆగిపోవచ్చు. కల్తీ చేసిన విమాన ఇంధనంతో నడిచే విమానంలో ప్రయాణించే ప్రమాదాన్ని మీరు కోరుకుంటారా ? అని ఎక్స్ లో ఆయన విమాన ప్రయాణికుల్ని ప్రశ్నించారు.
అలాగే విద్యావంతులైన, సమర్థవంతమైన ప్రభుత్వం రావలసిన సమయం ఆసన్నమైందని అరవింద్ కేజ్రివాల్ ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే విమాన ఇంధనంలో ఇథనాల్ కలపడానికి భారత్ అనుమతిపై ది ఎకనామిక్ టైమ్స్ పత్రికలో వచ్చిన కథనాన్ని తన ట్వీట్ కు జత చేశారు. ఇందులో పూర్తి వివరాలు ఉన్నాయని కేజ్రివాల్ తెలిపారు. ఇప్పటికే ఈ20 పెట్రోల్ కు వ్యతిరేకంగా ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాల్లో కేజ్రివాల్ ఉద్యమం నిర్వహిస్తున్నారు. అయినా కేంద్రం మాత్రం పార్లమెంట్ లో ఇప్పటికే పలుమార్లు ఇథనాల్ పెట్రోల్ ను సమర్దించుకుంది. దీన్ని ఇంకా దశల వారీగా విస్తరిచేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోంది.ఇక E20 మాత్రమే..! ప్యూర్ పెట్రోల్ మర్చిపోండి-పార్లమెంట్లో తేల్చేసిన కేంద్రం..!