డిప్యూటీ సీఎంకు తప్పిన పెను ప్రమాదం.. విమానం గాల్లో ఉండగానే..!

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే కు పెను ప్రమాదం తప్పింది. మే 7 గురువారం ఆయన ప్రయాణిస్తున్న విమానం వెనక్కు తిరిగి వచ్చేసింది. ఆకస్మాత్తుగా వచ్చిన గాలివాన కారణంగా విమానం ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పైలట్ సురక్షితంగా విమానాన్ని వెనక్కి తీసుకొచ్చారు. దాంతో డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే కు పెను ప్రమాదం తప్పినట్లు అయింది. థానే జిల్లాలోని ముర్బాద్ లో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఆయన వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ప్రయాణిస్తున్న విమానానికి భారీ ప్రమాదం తప్పింది. నవీ ముంబైలోని ఐరోలీ సమీపంలో విమానం ప్రయాణిస్తుండగా అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ దుమ్ము, తుఫాను, గాలివాన మొదలైంది. దాంతో వెంటనే పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రయాణం క్షేమం కాదని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు పైలట్ సూచనలతో షిండే తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

వెంటనే పైలట్ విమానాన్ని వెనక్కు తిప్పి జుహులోని పవన్ హన్స్ హెలిప్యాడ్ లో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. అయితే షిండేతో పాటు హెలికాప్టర్ లో ఉన్న సిబ్బంది అంతా సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇక ఏక్ నాథ్ షిండే 2024 నవంబర్ వరకూ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2024 డిసెంబర్ నుంచి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మరోవైపు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్ పవార్ ఈ ఏడాది జనవరి 28 న జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురి కావడంతో అజిత్ పవార్ తో పాటు మరో నలుగురు కూడా మృతి చెందారు.

EknathShinde Maharashtra DyCM Safe After Helicopter Aborts Trip Amid Sudden Weather Shift and Gale

ఇక ఇటీవల హైదరాబాద్- చండీగఢ్ ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్ లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది. తాజా ఘటనలతో విమాన ప్రయాణాల్లో భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+