కుబేర దిశలో బుధుడి సంచారంతో, మే నెలలో ఈ రాశులవారికి కనకవర్షం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడు, తెలివితేటలు, వ్యాపారం, వాణిజ్యం సంభాషణలకు కారకుడు అయిన బుధ గ్రహ సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. బుధుడు వర్తక వ్యాపారాలకు కారకుడు కావడంతో వివిధ రాశులలో బుధసంచారం ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా బుధుడు ఉచ్చ స్థితిలో ఉంటే ఆ రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి.
కుబేర దిశగా బుధుడు
ప్రస్తుతం ఈ నెలలో బుధుడు "ఉత్తరాభిముఖి"గా, అంటే కుబేర దిశగా సంచరించడం వల్ల ధనలాభ యోగాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిషశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కుబేర దిశగా, ఉత్తరాభిముఖంగా బుధుడు సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి వర్తక వాణిజ్యాలలో లాభాలు వస్తాయి. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. కుబేర దిశగా బుధ సంచారంతో లబ్ధిని పొందే రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఉత్తర దిశగా బుధ సంచారం కలిసి వస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి జాతకులు సానుకూలతను చూస్తారు. ఏ పని చేసినా కలిసి వస్తుంది. దీర్ఘకాలంగా పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఇది వీరికి కలిసొచ్చే కాలం.
మిధున రాశి
కుబేర దిశగా బుధ సంచారం మిధున రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మిధున రాశి జాతకులు వర్తక వ్యాపారాలలో లబ్ధిని పొందుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుతాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. దీర్ఘకాలంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా కొంతమందికి లాభాలు వస్తాయి.
కన్యారాశి
కన్య రాశి జాతకులకు కుబేర దిశగా బుధ సంచారం కలిసి వస్తుంది. ప్రత్యేకంగా కన్యారాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా బలపడతారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. పెట్టిన పెట్టుబడులు లాభాలను చేకూరుస్తాయి. కన్యా రాశి వారికి కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఇది అన్ని విధాలుగా కన్యారాశి వారికి లబ్ధిని చేకూరుస్తుంది.
మకర రాశి
మకర రాశి జాతకులకు కుబేర దిశగా బుధ సంచారం సానుకూల వాతావరణాన్ని తెస్తుంది. ఈ సమయంలో మకర రాశి వారు వర్తక వాణిజ్యాలలో లాభాలను పొందుతారు. వ్యాపారాలలో చేస్తే కొత్త పనులు మీకు కలిసివస్తాయి. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. మకర రాశి జాతకుల కుటుంబంలో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. ఇది అన్ని విధాలుగా మకర రాశి వారికి శ్రేయోదాయకం గా ఉంటుంది.
గమనిక: వ్యక్తిగత జాతక స్థితుల ఆధారంగా ఫలితాలు మారవచ్చని, పూర్తి వివరాల కోసం నిపుణులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications