రోహిత్ శర్మ రియాలిటీ షో: టీజర్ అవుట్- బుల్లితెరను దున్నేయడానికి రెడీ
టీమిండియా డాషింగ్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఏం చేసినా అభిమానులు ఆదరిస్తారు. ఇంటర్వ్యూలు, యాడ్‌లలో అతని విభిన్న శైలి ఎప్పుడూ అభిమానులను అలరిస్తుంది. ఇప్పుడు.. అదే శైలితో ఈ హిట్ మ్యాన్ బుల్లితెరపైకి వస్తే ఎలా ఉంటుంది?.. అది త్వరలో నిజం కానుంది. వాస్తవ రూపం దాల్చబోతోంది. సోనీ టీవీలో తన సొంత రియాలిటీ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు రోహిత్ శర్మ. సెకెండ్ ఇన్నింగ్ ఆరంభించనున్నాడు.
ఈ షోకు సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. ఓ హోటల్ లో కొందరు అభిమానులకు వన్ టు వన్ ఇంటర్వ్యూ ఇస్తూ కనిపించాడు రోహిత్. ఈ రియాలిటీ షో దేని గురించి, దాని ఉద్దేశ్యం ఏమిటనేది ఈ టీజర్‌లో వెల్లడి కాలేదు గానీ గార్డెన్ లైన్.. అనే పదం పదే పదే వినిపిస్తుంది ఇందులో. అదే ఈ షో మెయిన్ పాయింట్ గా కావొచ్చు. కోయీ గార్డెన్ మే నహీ ఘుమేగా.. అనే ఐకానిక్ డైలాగ్ ను మళ్లీ మళ్లీ చెప్పమని అభిమానులు కోరడం, దీనిపై అతను విసుక్కోవడం ఇందులో చూడొచ్చు.

ఒక దశలో రోహిత్ ఎంతగా విసిగిపోయాడంటే, తన ఇంటి టెర్రస్‌పై జరుగుతున్న గార్డెన్ పనిని ఆపమని ఎవరికో ఫోన్ చేసి చెప్పడం ఇందులో కొసమెరుపు. తాను చెప్పిన ఒక్క పంచ్ లైన్ ఇంతగా వైరల్ అయినప్పుడు, తన పూర్తి షో టీవీలో వస్తే ఏమవుతుంది?.. అని అతను తనలో తాను ఆలోచించుకుంటూ చిరునవ్వు చిందించడంతో ఈ టీజర్ ముగుస్తుంది. ఈ రియాలిటీ షోను బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ డెబ్యూగా అభివర్ణించింది సోనీ టీవీ.
Are you ready for the Biggest Entertainment Debut?
— Sony LIV (@SonyLIV) May 8, 2026
Coming Soon on @SonyTV & @SonyLIV #RohitOnSony#RohitSharmaDebut pic.twitter.com/ygyE17t8K4
రోహిత్‌కు ముందు, చాలా మంది ఇతర క్రికెటర్లు తమ స్వంత షోలతో టీవీలోకి అడుగుపెట్టారు. హోస్ట్‌లుగా వ్యవహరించారు. మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బెంగాలీ టీవీలో తన క్విజ్ షో 'దాదాగిరి అన్‌లిమిటెడ్'తో బుల్లితెరపైకి వచ్చారు. హర్భజన్ సింగ్, నవజోత్ సింగ్ సిద్ధూ, వసీం అక్రమ్, శ్రీశాంత్, సనత్ జయసూర్య వంటి ప్రపంచ స్థాయి క్రికెటర్లు కూడా టీవీలో కనిపించారు. ఇప్పుడు రోహిత్ శర్మ.. అదే పంథాను ఎంచుకున్నాడు.












Click it and Unblock the Notifications