సాయిరెడ్డి పార్టీలోకి మరో ఇద్దరు..! పక్కా అజెండాతో చేరికలు...!

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) తాను త్వరలో ప్రారంభించబోయే కొత్త పార్టీలోకి నేతల చేరికల్ని వేగవంతం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఎవరూ పెద్దగా పేరున్న నేతలు ఆయన పార్టీలో చేరినప్పటికీ, అత్యంత వ్యూహాత్మకంగా తాను అనుకున్న అజెండా మేరకు ఆయన చేరికల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఓ వీహెచ్పీ నాయకురాలు, మరో హిందూ షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి నేత సాయిరెడ్డితో చేతులు కలిపారు. ఈ సందర్భంగా సాయిరెడ్డితో తమ అనుబంధం, తమ భవిష్యత్ వ్యూహాల్ని వారు వెల్లడించారు.

SIR లో ఓటు కోల్పోయారా?- ఏపీ, తెలంగాణ సహా 7 రాష్టాల్లో ఈసీ మరో ఛాన్స్..!
SIR లో ఓటు కోల్పోయారా?- ఏపీ, తెలంగాణ సహా 7 రాష్టాల్లో ఈసీ మరో ఛాన్స్..!

ఈ నెల 11న తాను ప్రారంభించబోయే కొత్త పార్టీలోకి ఇవాళ వీహెచ్పీ నాయకురాలు సుమతీరెడ్డిని, అలాగే హిందూ షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి నేత బోని గణేష్ లను సాయిరెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ మేరకు తాము సాయిరెడ్డి ప్రారంభించే కొత్త పార్టీలో చేరబోతున్నట్లు వారు ప్రకటించారు. ఇందులో సుమతీ రెడ్డి తిరుపతి జిల్లా నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని, నియోజకవర్గం ఇంకా ఖరారు కాలేదన్నారు. స్వచ్చందంగా సాయిరెడ్డి పెట్టే పార్టీలో చేరుతున్నట్లు సుమతీరెడ్డి తెలిపారు. సాయిరెడ్డి అన్నతోనే హక్కుల పరిరక్షణ జరుగుతుందని వెల్లడించారు. మరో నేత బోని గణేశ్.. ఎస్సీ-హిందువుల హక్కులను పరిరక్షించాలని పిలుపునిచ్చారు. తాము హిందూ-ఎస్సీలమని, ఎస్సీల్లో 57 ఉప కులాలు ఉన్నాయని, తామంతా భారతీయ సంస్కృతులు పాటిస్తూ వస్తున్నామన్నారు. అయితే ఎస్సీల్లోని కొంతమంది క్రైస్తవులుగా మారి, ఎస్సీ హిందూ అని తప్పుడు సర్టిఫికెట్ తీసుకున్న వారి వల్ల ప్రయోజనాలు కోల్పోతున్నట్లు తెలిపారు. హక్కులను పరిరక్షిస్తామని సాయిరెడ్డి హామీ ఇవ్వడం వల్లే పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

two pro-Hindutva leaders join hands with vijayasai reddy for new party former mp targets ysrcp again
విజయసాయిరెడ్డి పార్టీలో తొలి చేరిక..! టీడీపీలో తొలి వికెట్..! 11 ట్రోల్స్ పై క్లారిటీ..!
విజయసాయిరెడ్డి పార్టీలో తొలి చేరిక..! టీడీపీలో తొలి వికెట్..! 11 ట్రోల్స్ పై క్లారిటీ..!

మరోవైపు వీరిద్దరి చేరిక సందర్భంగా మరోసారి వైసీపీ, జగన్ ని సాయిరెడ్డి టార్గెట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో కొన్ని సంవత్సరాలపాటు ప్రయాణం సాగించిన తాను.. పార్టీ నుంచి తానుగా వదిలి వెళ్లలేదన్నారు. వైసీపీలో పొమ్మనకుండా తనకు పొగ పెట్టారన్నారు. కొన్ని సందర్భాల్లో జగన్ కూడా తీవ్రంగా అవమానించారన్నారు. ఆ విధంగా కావాలనే తనను బయటికి పంపించారని, ఆ పార్టీ నుంచి బయటికి తోసేశారని సాయిరెడ్డి ఆరోపించారు. ఆత్మగౌరవం అనేది దెబ్బతీసే పని చేస్తే ఎవరైనా ఊరుకుంటారా అని ప్రశ్నించారు. వైసీపీలో 70కి పైగా అవమానాలు భరించి, ఇక భరించలేని పరిస్థితుల్లో బయటికి వచ్చానన్నారు. భూమ్మీద మనిషై పుట్టిన వారెవరూ.. ఇటువంటి అవమానాలు భరించకూడదన్నారు. తమ పార్టీలో అటువంటి పరిస్థితి ఎప్పటికీ ఉండదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+