విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు బ్రేకుల వేళ స్టాలిన్ కీలక ప్రకటన, కొత్త మలుపు..!!
తమిళనాడు రాజకీయాల్లో క్షణం క్షణం మారిపోతున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. నెంబర్ గేమ్ మొదలైంది. అతి పెద్ద పార్టీగా ఎన్నికల్లో ఆవిర్భవించిన విజయ్ టీవీకే కు మరో ఆరు సీట్ల మద్దతు అవసరం. ఈ సంఖ్యను సమకూర్చుకోవటం విజయ్ కు సమస్యగా మారుతోంది. ఇదే కారణంతో విజయ్ ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించలేదు. దీంతో.. ఇప్పుడు కొత్త పొత్తుల పై చర్చలు సాగుతున్నాయి. కాగా.. ఈ సస్పెన్స్ కొనసాగుతున్న వేళ మాజీ సీఎం స్టాలిన్ కీలక ప్రకటన చేసారు. ఈ నిర్ణయం కొత్త ములుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు సర్వం సిద్దం అయిన వేళ అనూహ్య పరిణామాలు తెర మీదకు వచ్చాయి. గవర్నర్ ను కలిసి తనకు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. ప్రభుత్వ ఏర్పాటు కు అవకాశం ఇవ్వాలని కోరారు. సభలో మెజార్టీ నిరూపించుకుంటానని చెప్పుకొచ్చారు. ఇందుకు గవర్నర్ అంగీకరించ లేదు. పూర్తి మెజార్టీ లెక్కలు సమర్పిస్తేనే... ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని తేల్చి చెప్పారు. కాగా.. తొలుత మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన కమ్యూనిస్టులు వెనుకడుగు వేసారు. కాంగ్రెస్ తమ మద్దతు ప్రకటించింది. ఇది డీఎంకే- కాంగ్రెస్ మధ్య విభేదాలకు కారణమైంది. ఈ లెక్కల వేళ మాజీ సీఎం స్టాలిన్ కీలక ప్రకటన చేసారు. తాము విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఏ విధంగానూ అడ్డు కాదని తేల్చి చెప్పారు. తమ నుంచి ఎలాంటి అడ్డంకులు ఉండవని స్పష్టం చేసారు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటులో మా జోక్యం ఉండదని స్టాలిన్ ప్రకటించారు.

విజయ్ కు ఆరు నెలలు సహకరిస్తాం
కాగా, విజయ్ ప్రభుత్వం.. పాలన ఆరు నెలలు గమనిస్తామని స్టాలిన్ చెప్పుకొచ్చారు. తాము అమలు చేసిన పథకాలను విజయ్ కొనసాగించాలని కోరారు. విజయ్ హామీ ఇచ్చిన అన్నింటిని అమలు చేయాలని.. వాస్తవంగా అవి అమలు సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఆ హామీలు అమలు చేయకుంటే ప్రశ్నిస్తామని చెప్పారు. తాము హామీ ఇచ్చినవి 90 శాతం మేరకు అమలు చేసామని వివరించారు. తాము విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు కలిగించబోమని విస్పష్టంగా ప్రకటించారు.
డీఎంకే రాష్ట్రంలో రాజ్యంగ సంక్షోభం.. ఎన్నికలు కోరుకోవటం లేదని వివరించారు. విజయ్ హామీలు నెరవేరిస్తే అంతకంటే సంతోషం లేదన్నారు. ఇదే సమయంలో డీఎంకే- అన్నా డీఎంకే మధ్య పొత్తు తో ప్రభుత్వం ఏర్పడుతుందనే వార్తలను రెండు పార్టీల నేతలు ఖండించారు. అలాంటి పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. దీంతో.. ఇప్పుడు విజయ్ మరో ఆరు సీట్ల మద్దతు ఏ విధంగా సాధిస్తారు.. గవర్నర్ రేపటి వరకు గడువు ఇవ్వటంతో ఏం చేస్తారు.. సీఎం అవుతారా.. కొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications