నిండు గర్భంతో ఎన్నికల్లో ప్రచారం.. TVK ఎమ్మెల్యేగా విజయం.. ఈమె గురించి షాకింగ్ విషయాలు తెలుసా..?
తమిళనాడులో ఎన్నికలు ముగిశాయి. విజయ్ టీవీకే పార్టీ ఈ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన టీవీకే పార్టీ 108 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఇక అధికార డీఎంకే 73 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అలాగే అన్నాడీఎంకే పార్టీ 53 స్థానాలను కైవసం చేసుకుంది. దాంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది టీవీకే పార్టీ. ఈ నేపథ్యంలో విజయ్ తాజాగా శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక చెన్నై సిటీ పరిధిలో మొత్తం 53 మంది మహిళలు ఎన్నికల్లో పోటీ చేశారు. వారిలో కేవలం ఇద్దరు మాత్రమే విజయం సాధించారు. వాళ్లిద్దరూ టీవీకే పార్టీకి చెందినవారు కావడం విశేషం. అంతేకాక ఆ ఇద్దరు మహిళలూ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
ఆ ఇద్దరిలో ఒకరే ఎంఆర్ పల్లవి.. ఎన్నికల సమాయానికి పల్లవి 8 నెలల గర్భంతో ఉంది. ఆమె తిరు వి కా నగర్ నుంచి టీవీకే పార్టీ తరఫున పోటీ చేసింది. సమీప ప్రత్యర్థిపై ఆమె 22,333 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అలాగే మరో మహిళ జే కామాక్షి పల్లవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. టీవీకే తరఫున బరిలోకి దిగిన కామాక్షి 54, 693 ఓట్ల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. చెన్నైలోని నియోజకవర్గాలకు మొత్తం 53 మంది మహిళలు పోటీ చేశారు. వారిలో 20 మంది స్వతంత్రులు మిగతా 33 మంది డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే, బీజేపీ, ఎన్టీకే పార్టీల తరఫున తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
ఇక ఎంఆర్ పల్లవి ఎన్నికల సమయంలో 8 నెలల గర్భిణిగా ఉంది. అయినా ధైర్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. తన నియోజకవర్గంలోని ఇంటింటికి వెళ్లి ఓటు కోసం అభ్యర్థించింది. అలా ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. తన జీవితం ప్రజాసేవకే అంకితం అని పేర్కొంది. ఆమె సన్నిహితుడు కార్తిక్ మాట్లాడుతూ.. పల్లవి ఎన్నికల ప్రచారం ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగిందని.. ప్రచారం నిర్వహిస్తుండగా ఓసారి స్పృహ కూడా కోల్పోయిందని పేర్కొంది. కానీ ధైర్యం, పట్టుదలతో అలాగే ఎన్నికల ప్రచారం నిర్వహించిందని తెలిపారు.

తమిళనాడు ఎన్నికల్లో ప్రముఖ మహిళా నేతలుగా పేరొందిన తమిళిసై సౌందరరాజన్, గోకుల ఇందిర, బీ వలార్మతి.. తదితరులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. విజయ్ వేవ్ ముందు తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం కొలత్తూరు నియోజకవర్గంలో ఘోర ఓటమిని చవిచూశారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో పరాజయం పాలయ్యారు.












Click it and Unblock the Notifications